Chhattisgarh: హిడ్మా టార్గెట్‌గా ఆపరేషన్ కర్రే గుట్టలు..
ABN , Publish Date - Apr 24 , 2025 | 10:05 AM
ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ టాప్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా టార్గెట్‌గా భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాయి. కర్రెగుట్టల్లో మందుపాతరలు ఉన్నట్లు మావోయిస్టులు ప్రకటించిన పది రోజుల తరువాత ఈ పరిణామం జరగడం సంచలనం రేకెత్తిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ టెన్షన్‌గా ఉంది.

ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ సుప్రీం కమాండర్ (Maoist Supreme Commander) మాడవి హిడ్మా (Hidma) టార్గెట్ (Target)గా కేంద్ర బలగాలు (Battalions) కర్రే గుట్టలు (Karre Guttalu) వద్ద ఆపరేషన్ (Operation) చేపట్టాయి. దీంతో కర్రే గుట్టల ప్రాంతం వార్ జోన్ (War zone)గా మారింది. వైమానిక దళం డ్రోన్లు, MI 17 హెలికాప్టర్లతో జల్లెడ పడుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh), తెలంగాణ (Telangana, మహారాష్ట్ర (Maharastra) మూడు రాష్ట్రాల నుండి భద్రతా బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. మోస్ట్ వాంటెడ్ నక్సల్ నాయకుడు హిడ్మా అత్యంత ఆధునిక ఆయుధాలతో కూడిన అనేక మంది మావోయిస్టులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. 1 నుండి 5 వరకు ఉన్న PLGA బెటాలియన్లకు అత్యంత సురక్షితమైన జోన్‌గా కర్రే గుట్టలున్నాయి.
Also Read..: మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్టు..
100కు పైగా ఐఇడి బాంబులు..
నక్సలైట్ ప్రెస్ నోట్‌లో కర్రెగుట్ట నాడ్‌పల్లి కొండ గురించి ప్రస్తావించారు. ఈ ప్రాంతంలో 100కు పైగా ఐఇడి బాంబులు అమర్చినట్లు లేఖలో వెల్లడించారు. 3 వేల మందికిపైగా మావోయిస్టులు దాక్కున్నారని సెర్చ్ ఆపరేషన్ కర్రే గుట్టలు పర్యవేక్షిస్తున్న బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు. దీంతో తెలంగాణ- ఛత్తీస్‌గడ్ సరిహద్దు నివురు గప్పిన నిప్పులా ఉంది. కర్రెగుట్టల్లో మందుపాతరలు ఉన్నట్లు మావోయిస్టులు ప్రకటించిన పది రోజుల తరువాత ఈ పరిణామం జరగడం సంచలనం రేకెత్తిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో టెన్షన్ టెన్షన్‌గా ఉంది. మంగళవారం ఉదయం నుంచి పోలీసు బలగాలు వేలాది సంఖ్యలో తరలివచ్చి గుట్టల చుట్టూ మోహరించాయి.
కర్రెగుట్టలను దిగ్బంధించిన పోలీస్ బలగాల ….
తెలంగాణ చత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను పోలీస్ బలగాలు దిగ్బందించాయి. పోలీసు బలగాలు ఐదు రాష్ట్రాల నుండి తరలివచ్చి కర్రెగుట్టలను చుట్టుముట్టాయి. గుట్టపైన మావోయిస్టులు భారీ ఎత్తున ఉన్నారన్న సమాచారం మేరకు వారిని నేరుగా అటాక్ చేసేందుకు పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. నక్సలైట్లు ఏ వైపు నుండి కూడా తప్పించుకోకుండా ఉండేందుకు గుట్ట చుట్టూ మోహరించారు. మరోవైపు మావోయిస్టులు క్లైమోర్ మైన్స్‌ను గుట్ట చుట్టూ పాతి పెట్టడం వల్ల పోలీసులు గుట్టపైకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం...
మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులోభాగంగా 2026, మార్చిలో నెలలోపు దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ద్వయం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో.. మావోయిస్టులను నిర్మూలించారు. జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వం వరుసగా చర్యలు చేపడుతోంది. కానీ ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రభావం కొద్దిగా ఉంది. ఈ నేపథ్యంలో మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీంతో ఇటీవల కాలంలో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో వరుస ఎన్ కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. దాంతో మావోయిస్టులకు వరుస దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఇంకోవైపు మావోయిస్టులు లొంగిపోవాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే పిలుపు ఇచ్చింది. జన జీవన స్రవంతిలో కలిసి.. దేశ నిర్మాణంలో భాగస్యామ్యం కావాలని మావోయిస్టులను రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సూచించాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి..
తుపాకీ లాక్కోబోయి.. తూటాలకు బలైపోయి..
For More AP News and Telugu News