Share News

టూవీలర్లకు టోల్‌ చార్జీల యోచన లేదు : గడ్కరీ

ABN , Publish Date - Jun 27 , 2025 | 03:39 AM

దేశంలోని జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్‌ టాక్స్‌ విధించే ప్రతిపాదనేమీలేదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం స్పష్టం చేశారు.

టూవీలర్లకు టోల్‌ చార్జీల యోచన లేదు : గడ్కరీ

న్యూఢిల్లీ, జూన్‌ 26: దేశంలోని జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్‌ టాక్స్‌ విధించే ప్రతిపాదనేమీలేదని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం స్పష్టం చేశారు. టూవీలర్‌ వాహనాలకు టోల్‌ మినహాయింపు కొనసాగుతుందన్నారు. వచ్చే నెల 15 నుంచి హైవేలపై టూవీలర్లకు టోల్‌ చార్జీలను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్పందించారు. టూవీలర్లపై టోల్‌ టాక్స్‌ విధిస్తారంటూ కొన్ని మీడియా సంస్థలు తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని, ఇది సరికాదన్నారు. కాగా టూవీలర్లకు టోల్‌ చార్జీలు విధించే యోచన ప్రభుత్వ పరిశీలనలో లేదని ఎన్‌హెచ్‌ఏఐ కూడా స్పష్టంచేసింది.

Updated Date - Jun 27 , 2025 | 03:45 AM