Share News

Nitish Kumar: 20 ఏళ్లుగా మీ కోసమే సేవ

ABN , Publish Date - Nov 02 , 2025 | 04:04 AM

బిహార్‌లో మరో ఐదు రోజుల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ శనివారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి...

Nitish Kumar: 20 ఏళ్లుగా మీ కోసమే సేవ

  • మరో అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి

  • సీఎం నితీశ్‌ వీడియో సందేశం

పాట్నా, నవంబరు 1: బిహార్‌లో మరో ఐదు రోజుల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌ శనివారం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మూడు నిమిషాల వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గత రెండు దశాబ్దాలుగా ప్రజలకు సేవ చేస్తున్నానని, నిజాయతీగా, కష్టపడి పనిచేశానని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించి మరో అవకాశం ఇవ్వాలని, బిహార్‌ను టాప్‌ రాష్ట్రాల సరసన చేరేలా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాగా, ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కూడా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదని జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ తేల్చిచెప్పారు. పాట్నాలో ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. ఈ విషయాన్ని కావాలంటే తాను రాతపూర్వకంగా కూడా చెప్తానన్నారు.

Updated Date - Nov 02 , 2025 | 04:04 AM