Red Fort Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసు.. ఉమర్‌కు సాయం చేసింది ఇతడే..
ABN , Publish Date - Nov 18 , 2025 | 02:03 PM
ఢిల్లీ కారు బాంబు దాడి కేసుకు సంబంధించి మరో వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్ర కోట దగ్గర కారు బాంబు బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఉమర్ అనే వ్యక్తి నవంబర్ 10వ తేదీన ఐ20 కారుతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఉమర్‌తో సంబంధం ఉన్నవారిని ఎన్ఐఏ అరెస్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు 10కి పైగా మందిని అదుపులోకి తీసుకుంది. తాజాగా, ఉమర్ ఆత్మాహుతి దాడిలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అతడికి సంబంధించిన వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఎన్ఐఏ తెలిపిన వివరాలు ప్రకారం.. ఎర్రకోట దగ్గర బాంబు బ్లాస్ట్‌కు పాల్పడ్డ ఉమర్‌కు సహకరించిన వ్యక్తిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.
అతడిని జమ్మూకాశ్మీర్‌కు చెందిన జాసిర్ బిలాల్ వాణి అలియాస్ డానిష్‌గా గుర్తించింది. జాసిర్ బిలాల్ వాణిని జమ్మూకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అదుపులోకి తీసుకుంది. ఉమర్ బాంబు దాడి చేయడానికి అవసరమైన టెక్నికల్ సపోర్టును జాసిర్ బిలాల్ వాణి అందించాడు. కారు బాంబు దాడి కోసం మాత్రమే కాకుండా పలు చోట్ల దాడులు చేయటం కోసం ఉమర్‌తో కలిసి అతడు పని చేశాడు. డ్రోన్స్‌ను మాడిఫై చేయడానికి, రాకెట్లు తయారు చేయడానికి ప్రయత్నించాడు. వాటి సాయంతో ఉగ్రవాదులు దాడులకు పాల్పడాలని చూశారు.
ఎర్రకోట బాంబు దాడి వెనకున్న కుట్రల గురించి తెలుసుకోవడానికి ఎన్ఐఏ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఉగ్రదాడిలో భాగమైన వారి కోసం జమ్మూకాశ్మీర్‌లో ముమ్మురంగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది.
జాసిర్ బిలాల్ వాణి తొలి ఫొటో..
ఎన్ఐఏ అధికారుల అదుపులో ఉన్న జాసిర్ బిలాల్ వాణి ఫొటో ఒకటి పలు జాతీయ మీడియాల్లో ప్రచురితం అయింది. జాసిర్ బిలాల్ వాణి అరెస్ట్ అయిన తర్వాత వెలుగులోకి వచ్చిన మొదటి ఫొటో అంటూ ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి
అయ్యో ప్రమీల.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..
ఎయిర్‌పోర్ట్ టెర్మినల్స్‌లో బ్లాస్ట్ జరుగుతుంది.. గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్