Nagpur Bandit Bride: 8 పెళ్లిళ్లు చేసుకుంది.. 9వ సారి అడ్డంగా దొరికిపోయింది.
ABN , Publish Date - Aug 01 , 2025 | 05:31 PM
Nagpur Bandit Bride: సమీరా ఓ భర్తనుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు.. మరో భర్త నుంచి 15 లక్షల రూపాయలు దోచేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రిజర్వ్ బ్యాంకులో పనిచేసే సీనియర్ అధికారులను కూడా ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసింది.

మహారాష్ట్రలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ డబ్బుల కోసం ఏకంగా 8 మందిని పెళ్లి చేసుకుంది. 8 మంది దగ్గరినుంచి లక్షలు దోచేసి పరారైంది. 9వ పెళ్లి చేసుకోవడానికి సిద్దమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. ప్రస్తుతం కటకటాల్లో ఊసలు లెక్కిస్తూ కూర్చుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగ్‌పూర్‌కు చెందిన సమీరా ఫాతిమా బాగా చదువుకుంది. టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఏం పాడు బుద్ధి పుట్టిందో ఏమో తెలీదు కానీ.. డబ్బుల కోసం తప్పుదోవ పట్టింది.
ఓ గ్యాంగ్‌తో చేరి డబ్బున్న వివాహిత ముస్లింలను పెళ్లి చేసుకుని మోసం చేయటం మొదలెట్టింది. 15 ఏళ్లనుంచి మోసాలకు పాల్పడుతోంది. ఇప్పటి వరకు 8 మంది మగాళ్లను మోసం చేసింది. పక్కా ప్లాన్‌తో వారిని పెళ్లి చేసుకుని లక్షల రూపాయలు దోచేసింది. మొదటగా మాట్రిమోనియల్ వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్ నుంచి మగాళ్లను సెలెక్ట్ చేసుకునేది. ఫేస్‌బుక్ లేదా వాట్సాప్ కాల్స్ ద్వారా వారితో పరిచయం పెంచుకునేది. తన ఎమోషనల్ స్టోరీ చెప్పి దగ్గరయ్యేది. తనకు భర్తతో విడాకులు అయ్యాయని, ఓ పిల్లాడు ఉన్నాడని వారికి చెప్పేది.
వారిని పెళ్లి చేసుకునేది. పెళ్లి తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేసి.. పెద్ద మొత్తంలో తన ఖాతాలకు డబ్బులు పంపేలా చేసుకునేది. తర్వాత అక్కడినుంచి పరారయ్యేది. సమీరా ఓ భర్తనుంచి ఏకంగా 50 లక్షల రూపాయలు.. మరో భర్త నుంచి 15 లక్షల రూపాయలు దోచేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రిజర్వ్ బ్యాంకులో పనిచేసే సీనియర్ అధికారులను కూడా ఆమె పెళ్లి చేసుకుని మోసం చేసింది. పెద్ద మొత్తంలో డబ్బులు దోచేసింది. 8 మందిని విజయవంతంగా మోసం చేసింది. 9వ వ్యక్తిని కూడా సెలెక్ట్ చేసుకుంది. అయితే, ఆమె చేతిలో మోసపోయిన కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జులై 29వ తేదీన 9వ వ్యక్తిని కలుసుకునే క్రమంలో టీషాపులో ఉన్న సమీరాను పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో నిత్య పెళ్లి కూతురు జైలు పాలైంది.
ఇవి కూడా చదవండి
దేశంలో హాట్ టాపిక్ గా మారిన కేరళ నన్స్ అరెస్ట్
దూడను నోట కరుచుకున్న చిరుత.. ఆవును చూసి పరుగోపరుగు..