Model Anu Varmora: ప్రేమలో విఫలం.. ఊహించని నిర్ణయం తీసుకున్న మోడల్..
ABN , Publish Date - Jun 09 , 2025 | 06:42 AM
Model Anu Varmora: గత కొద్దిరోజుల నుంచి అంజలి డిప్రెషన్లో ఉంది. ఈ నేపథ్యంలోనే శనివారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వరుస పోస్టులు పెట్టింది. ‘నీకు నేను ఏమీ కానని ఈ రోజే తెలిసింది’ అంటూ ఓ పోస్టు పెట్టింది.

శారీరకంగా ఎన్ని కష్టాలు వచ్చినా.. ఎన్ని నష్టాలు వచ్చినా మనిషి తట్టుకుని నిలబడగలడు. కానీ, ప్రేమ విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కూడా నరకం చూపిస్తాయి. ప్రేమించిన వారు దూరం అయితే, ఆ బాధ భరించటం కష్టం. అందుకే చాలా మంది ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు. తాజాగా, గుజరాత్‌కు చెందిన ఓ మోడల్ ప్రేమలో విఫలమై ప్రాణాలు తీసుకుంది. ప్రియుడు దూరం అయ్యాడన్న బాధలో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన అంజలి వర్మోరో అనే యువతి మోడలింగ్ చేస్తోంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమెను 37 వేల మంది ఫాలో అవుతున్నారు. గత కొద్దిరోజుల నుంచి అంజలి డిప్రెషన్లో ఉంది. ఈ నేపథ్యంలోనే శనివారం తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వరుస పోస్టులు పెట్టింది. ‘నీకు నేను ఏమీ కానని ఈ రోజే తెలిసింది’ అంటూ ఓ పోస్టు పెట్టింది. మరో పోస్టులో .. ‘మనం అన్నీ కోల్పోయినా అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ, ప్రేమను కోల్పోతే మాత్రం అది చాలా బాధిస్తుంది’అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
శనివారం ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. గదిలోకి వెళ్లిన అంజలి ఎంతకీ బయటకు రాకపోవటంతో కుటుంబసభ్యులు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అంజలి ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆమె చనిపోయిందని ధ్రువీకరించుకున్నాక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అంజలి ప్రియుడి కోసం అన్వేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
టీనేజర్లు వీటికి దూరంగా ఉండాలి