Share News

Mayawati: మేనల్లుడికి తిరిగి కీలక బాధ్యతలు అప్పగించిన మాయావతి

ABN , Publish Date - May 18 , 2025 | 04:10 PM

ఢిల్లీ లోథిరోడ్‌లోని సెంట్రల్ ఆఫీస్‌లో బీఎస్‌పీ జాతీయ స్థాయి సమావేశం ఆదివారం నాడు జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ అధికారులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Mayawati: మేనల్లుడికి తిరిగి కీలక బాధ్యతలు అప్పగించిన మాయావతి

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ (BSP) చీఫ్ మాయావతి (Mayawati) మరోసారి తన మేనల్లుడికి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్‌ (Chief National Coordinator)గా ఆయనను నియమించారు. ఢిల్లీ లోథిరోడ్‌లోని సెంట్రల్ ఆఫీస్‌లో బీఎస్‌పీ జాతీయస్థాయి సమావేశం ఆదివారం నాడు జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అన్ని జిల్లాల అధ్యక్షులు, కోఆర్డినేటర్లతోపాటు జాతీయ కోఆర్డినేటర్లు, జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల అధ్యక్షులు హాజరయ్యారు.

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై వ్యాఖ్యలు.. యూనివర్శిటీ ప్రొఫెసర్ అరెస్టు


ఈ సమావేశంలో ఆకాష్ ఆనంద్‌కు పార్టీ చీఫ్ నేషనల్ కోఆర్డినేటర్‌‌గా మాయావతి బాధ్యతలు అప్పగించారు. ఈసారి పార్టీని, పార్టీ ఉద్యమాన్ని అత్యంత జాగరూకతతో, నిబద్ధతతో ఆయన ముందుకు తీసుకువెళ్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.


బహిష్కరణ, తిరిగి పార్టీలోకి..

ఆకాష్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు గత మార్చి 3న మాయావతి ప్రకటించారు. ఆకాష్ తన మామగారైన అశోక్ సిద్ధార్ధ్ ప్రభావానికి లోనుకావడంతో మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా బహిష్కరణ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. పార్టీ నేషనల్ కోఆర్డినేటర్‌గా పనిచేసిన ఆకాష్‌ను అంతకు ముందు తన రాజకీయ వారసుడిగానూ మాయావతి ప్రకటించారు. పార్టీ నుంచి బహిష్కరించిన 40 రోజుల తర్వాత తిరిగి ఏప్రిల్ 13న ఆయనను పార్టీలోకి మాయవతి తీసుకున్నారు. గతంలో చేసిన పొరపాట్లకు ఆకాష్ విచారం వ్యక్తం చేయడంతో మాయవతి ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మరో వీడియో విడుదల చేసిన ఆర్మీ

India Pakistan Ceasefire: సీజ్‌ఫైర్‌పై భారత ఆర్మీ సంచలన ప్రకటన.. ఏం చెప్పిందంటే..

Updated Date - May 18 , 2025 | 04:56 PM