Massive Encounter: బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టుల మృతి..
ABN , Publish Date - Dec 03 , 2025 | 02:50 PM
డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు మవోయిస్టులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, కోబ్రా భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. పశ్చిమ బస్తర్ డివిజన్ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
మన్యంలో టెన్షన్ వాతావరణం..
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లు జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం మన్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్ల ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇలాంటి సమయంలో మంగళవారం నుంచి మావోయిస్టు పార్టీకి చెందిన పీఎల్‌జీవో వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
సంచార్ సాథీతో నిఘాకు తావే లేదు.. లోక్‌సభలో సింధియా
రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుడు.. కుక్క మృతి