Volleyball Player: వాలీబాల్ ప్లేయర్ వికృత రూపం.. వందల మంది అమ్మాయిలతో..
ABN , Publish Date - Apr 28 , 2025 | 05:21 PM
Mangaluru Volleyball Player: అతడి దగ్గరినుంచి సెల్ ఫోన్ లాక్కున్నారు. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. అతడు వేరే అమ్మాయిలతో కలిసి ఉన్న పర్సనల్ ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. అవి చూసి వారు షాక్ అయ్యారు. తర్వాత సయ్యద్‌ను పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

ప్రేమ పేరుతో అమ్మాయిలు, బాలికల జీవితాలతో ఆడుకునే మోసగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అమాయక ఆడపిల్లలు మోసగాళ్ల తప్పుడు బుద్ధి తెలియక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మానసికంగా, శారీరకంగా కూడా ఎంతో నష్టపోతున్నారు. తాజాగా, ఓ వాలీబాల్ ప్లేయర్ ఓ అమ్మాయిని వేధించాడు. ఈవిషయం తెలిసి.. అతడిపై అమ్మాయి తరపు వారు దాడి చేశారు. అతడి ఫోన్ లాక్కుని చూడగా వందల కొద్ది పాడు వీడియోలు బయటపడ్డాయి. వాలీ బాల్ ప్లేయర్ చాలా మంది అమ్మాయిలతో అభ్యంతరకర స్థితిలో ఉన్న దృశ్యాల తాలూకా వీడియోలు అవి. వాటిని చూసి అందరూ షాక్ అయ్యారు. అతడ్ని పోలీసులకు పట్టించారు.
ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ కన్నడ, కర్కలకు చెందిన సయ్యద్ అనే యువకుడు బేల్తన్‌గాడీలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. అతడు వాలీ బాల్ ఆట కూడా ఆడతాడు. సయ్యద్ గత కొంత కాలంనుంచి ఓ విద్యార్థినిని మెసేజ్ల ద్వారా వేధిస్తూ ఉన్నాడు. దీంతో అమ్మాయి తరపు వారు రంగంలోకి దిగారు. అతడిపై దాడి చేశారు. అతడి దగ్గరినుంచి సెల్ ఫోన్ లాక్కున్నారు. దాన్ని ఓపెన్ చేసి చూడగా.. అతడు వేరే అమ్మాయిలతో కలిసి ఉన్న పర్సనల్ ఫొటోలు, వీడియోలు బయటపడ్డాయి. అవి చూసి వారు షాక్ అయ్యారు.
తర్వాత సయ్యద్‌ను పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే సయ్యద్ కూడా తనపై దాడి చేసిన వారిపై కేసు పెట్టాడు. రెండు వర్గాల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఫొటోలు, వీడియోలు ఉన్న సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. ఇక, సయ్యద్ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. అతడి ఫోనులో వీడియోలు బయటపడ్డాయన్న వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది.
ఇవి కూడా చదవండి
Milk Delivery on Audi Car: పాలు అమ్ముకోవడానికి ఏకంగా బ్యాంక్ జాబునే వదిలేశాడు..
Hanuman Garhi: 300 ఏళ్ల ఆచారానికి బ్రేక్.. రాముడి దగ్గరకు హనుమాన్ భక్తుడు