Share News

కన్న కొడుకు క్రూరత్వం.. కుక్క కోసం తల్లిని చంపేశాడు..

ABN , Publish Date - Apr 19 , 2025 | 11:27 AM

శుక్రవారం కుక్క పిల్లను కొనడానికి సిద్ధమయ్యాడు.కుక్క పిల్ల ధర 800 రూపాయలు. అతడి దగ్గర 600 మాత్రమే ఉన్నాయి. దీంతో మిగిలిన 200 రూపాయలు ఇవ్వమని తల్లిని అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పటంతో దారుణానికి తెగబడ్డాడు. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు.

కన్న కొడుకు క్రూరత్వం.. కుక్క కోసం తల్లిని చంపేశాడు..
Chhattisgarh News

మనుషులు విచక్షణ కోల్పోతున్నారు. ఏది మంచి, ఏది చెడు అన్నది తెలుసుకోలేకపోతున్నారు. తమకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. ఒక వేళ దక్కకపోయినా కూడా దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే.. చిన్న చిన్న కారణాలకు కూడా మనుషుల్ని చంపేస్తున్నారు. ఆఖరికి రక్త సంబంధీకుల్ని కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా, ఓ వ్యక్తి కుక్క పిల్ల కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తల్లిని కొట్టి చంపేశాడు. భార్యపై కూడా దాడి చేసి గాయపరిచాడు. ఈ సంఘటన ఛత్తీష్‌ఘర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛత్తీష్‌ఘర్‌లోని ఉర్లా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగేశ్వర్ నగర్‌లో 45 ఏళ్ల ప్రదీప్ దేవాంగన్ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ప్రదీప్ రిక్షా తోలే పని చేస్తున్నాడు. గత కొద్దిరోజుల నుంచి అతడు కుక్క పిల్లను పెంచుకోవాలని అనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కుక్క పిల్లను కొనడానికి సిద్ధమయ్యాడు. కుక్క పిల్ల ధర 800 రూపాయలు. అతడి దగ్గర 600 మాత్రమే ఉన్నాయి. దీంతో మిగిలిన 200 రూపాయలు ఇవ్వమని తల్లి గణేషిని అడిగాడు. అయితే, ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. డబ్బులు ఇచ్చేది లేదని చెప్పింది. కుక్క పిల్ల కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వలేదని ప్రదీప్‌కు తల్లిపై కోపం వచ్చింది.


సుత్తితో తల్లిపై దాడి చేశాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. ప్రదీప్‌ను అడ్డుకోవడానికి వచ్చిన భార్య రాజేశ్వరిపై కూడా అతడు దాడి చేశాడు. ఇదంతా చూస్తున్న 15 ఏళ్ల కొడుకు ఇంటినుంచి బయటకు పరిగెత్తాడు. పొరిగిళ్లవాళ్లను సాయం కోసం పిలిచాడు. పొరిగిళ్ల వారు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారు. భయపడిపోయిన ప్రదీప్ అక్కడినుంచి పారిపోయాడు. పొరిగిళ్ల వారు గాయపడ్డ ఇద్దరినీ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రదీప్ తల్లి చికిత్సపొందుతూ చనిపోయింది. భార్య ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రదీప్ కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జులై నెల ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల

Lady Don: లేడీ డాన్ కళ్లముందే హత్య.. ఆమె బుద్ధే మంచిది కాదు..

Updated Date - Apr 19 , 2025 | 11:27 AM