Maithili Thakur: బిహార్ ఎన్నికలు.. ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి మైథిలీ ఠాకూర్
ABN , Publish Date - Nov 16 , 2025 | 02:04 PM
జానపద గాయని మైథిలీ ఠాకూర్ బీహార్ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన మైథిలీ ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు.
పాట్నా, నవంబర్ 16: జానపద గాయని మైథిలీ ఠాకూర్ బిహార్ ఎన్నికల్లో సంచలనం సృష్టించారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున బరిలోకి దిగిన మైథిలీ ఆర్జేడీ దిగ్గజ నేత వినోద్ మిశ్రాను 11 వేల ఓట్ల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించారు. అలీనగర్ నియోజకవర్గంలో బీజేపీ గెలవడం ఇదే తొలిసారి. బిహార్ ఎన్నికల్లో గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా మైథిలి రికార్డ్ సృష్టించారు (youngest MLA Bihar).
మైథిలీ వయసు 25 సంవత్సరాలు. మైథిలీ ఖాతాలో మరో రికార్డు కూడా ఉంది. భారత్‌లో 21వ శతాబ్దంలో జన్మించి ఎమ్మెల్యే అయిన తొలి వ్యక్తిగా మైథిలీ నిలిచారు. మైథిలీ జులై 25, 2000న జన్మించారు. ఇప్పటివరకు మన దేశంలో జన్మించిన వారందరూ 19, 20వ శతాబ్దాలలో జన్మించిన వారే. అంటే 2000 సంవత్సరానికి ముందు జన్మించినవారే. 2000 సంవత్సరంలో జన్మించి ఎమ్మెల్యే అయిన తొలి వ్యక్తిగా మైథిలీ రికార్డు సృష్టించారు (Maithili Thakur victory).
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా పోటీ చేసిన మొదటి సారే ఎమ్మెల్యేగా గెలుపొందిన తక్కువ మందిలో మైథిలీ కూడా ఒకరిగా నిలిచారు (Bihar election 2025). మైథిలీ తండ్రి రమేష్ ఠాకూర్ శాస్త్రీయ సంగీతకారుడు, గాయకుడు. తల్లి భారతి గృహిణి. చిన్నప్పటి నుంచే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న మైథిలీ తన జానపద పాటలతో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 2024లో ఆమె శబరి మీద పాడిన పాట ప్రధాని మోదీని ఎంతగానో ఆకట్టుకుంది. ఆమెపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు.
ఇవి కూడా చదవండి:
తెలంగాణ స్పీకర్‌పై కేటీఆర్ కోర్టు ధిక్కార పిటిషన్.. రేపు విచారణ