Teacher: పిల్లలతో కలిసి మందు తాగిన ఉపాధ్యాయుడు
ABN , Publish Date - Apr 19 , 2025 | 01:50 PM
Teacher Offers Alcohol To Students: ఓ ఉపాధ్యాయుడు తన స్థాయిని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాడు. విద్యార్థులతో కలిసి మందు సిట్టింగ్ వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడికి తగిన శాస్తి జరిగింది.

పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే గాడి తప్పుతున్నారు. మంచి, చెడుల విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉన్నారు. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు కొందరైతే.. పిల్లల్ని హింసిస్తున్నారు వారు మరికొందరు. కొత్తగా మూడో రకం కూడా బయలు దేరారు. ఈ క్యాటగిరీ ఉపాధ్యాయులు పిల్లలకు చెడు అలవాట్లు నేర్పుతున్నారు. తాజాగా, ఓ గవర్నమెంట్ టీచర్ విద్యార్థులతో కలిసి మందు సిట్టింగ్ వేశాడు. స్వయంగా ఆయనే పిల్లలకు మందు కలిపి ఇచ్చాడు. చేసిన తప్పుకు శిక్షగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు.
ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని కత్ని జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. లాల్ నవీన్ ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి కత్ని జిల్లా, కిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం నవీన్ విద్యార్థులతో మందు సిట్టింగ్ వేశాడు. స్వయంగా ఆయనే గ్లాసులో మందు మిక్సింగ్ చేశాడు. పిల్లలతో మందు తాగించాడు. శుక్రవారం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పిల్లలతో మందు సిట్టింగ్ వేసిన టీచర్‌పై విమర్శలు మొదలయ్యాయి.
నెటిజన్లు తీవ్ర స్థాయిలో అతడిపై మండిపడుతున్నారు. ఆ వీడియో కలెక్టర్ దిలీప్ కుమార్ యాదవ్ దృష్టికి కూడా వెళ్లింది. సంఘటనపై ఆయన సీరియస్‌గా స్పందించారు. నవీన్‌పై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారి ఓపీ సింగ్‌ను ఆదేశించారు. ఓపీ సింగ్ విచారణ జరిపిన అనంతరం.. నవీన్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై ఓపీ సింగ్ మాట్లాడుతూ.. ‘ ఈ వీడియో అధికారుల దృష్టికి వచ్చింది. అతడ్ని లాల్ నవీన్ ప్రతాప్ సింగ్‌గా గుర్తించాము. వెంటనే ఉద్యోగం నుంచి తీసేశాము’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
మహా కుంభ్‌మేళాకు టెంట్లు సప్లై చేసిన కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం
JEE Main 2025: జేఈఈ ఇండియా టాపర్ ఓం ప్రకాశ్ విజయ రహస్యం ఇదే..