KRIDL Scam: మాజీ క్లర్క్ అవినీతి దందా.. 15వేల జీతం.. 30 కోట్ల ఆస్తులు
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:42 PM
KRIDL Scam: కలకప్పకు చెందిన నాలుగు వాహనాలు, 350 గ్రాముల బంగారం, 1.5 కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, గత కొద్దిరోజుల నుంచి లోకాయుక్త అధికారులు విజృంభిస్తున్నారు. అవినీతి తిమింగలాలను వెతికి మరీ పట్టుకుంటున్నారు.

ఓ భారీ అవినీతి తిమింగలం లోకాయుక్త అధికారుల చేతికి చిక్కింది. కర్ణాటక రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (KRIDL)లో పని చేసిన మాజీ క్లర్క్ అవినీతితో కోట్ల రూపాయలు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం ఆ మాజీ క్లర్క్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. లెక్కకు రాని 30 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించారు. బెంగళూరుకు చెందిన కలకప్ప నిడగుండి అనే వ్యక్తి కుప్పల్ కేఆర్ఐడీఎల్‌లో క్లర్క్‌గా పని చేశాడు. అప్పుడు కలకప్ప నెల జీతం కేవలం 15 వేల రూపాయలు మాత్రమే.
కానీ, ఇప్పుడు ఆయన ఆస్తుల విలువ 30 కోట్ల రూపాయలు. ఆయనకు 24 ఇళ్లులు, నాలుగు ప్లాట్లు, 40 ఎకరాల పొలం ఉంది. ఈ ఆస్తులు కొన్ని ఆయన పేరు మీద.. మరికొన్ని ఆయన భార్య, బావమరిది పేర్ల మీద ఉన్నాయి. కలకప్ప, మాజీ కేఆర్ఐడీఎల్ ఇంజనీర్ ప్రాజెక్టుల పేరుతో పెద్ద మొత్తంలో అవకతవకలకు పాల్పడినట్లు లోకాయుక్త అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే కలకప్ప ఇంట్లో సోదాలు నిర్వహించారు. లెక్కకు రాని 30 కోట్ల రూపాయల ఆస్తుల్ని గుర్తించారు.
కలకప్పకు చెందిన నాలుగు వాహనాలు, 350 గ్రాముల బంగారం, 1.5 కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, గత కొద్దిరోజుల నుంచి లోకాయుక్త అధికారులు విజృంభిస్తున్నారు. అవినీతి తిమింగలాలను వెతికి మరీ పట్టుకుంటున్నారు. జులై 23వ తేదీన ఏకంగా ఎనిమిది మంది ప్రభుత్వ అధికారులకు చెందిన స్థలాల్లో సోదాలు నిర్వహించారు. అందులో ఐఏఎస్ అధికారి వాసంతి అమర్ బీవీ కూడా ఉన్నారు. వాసంతి అమర్ కూడా అవినీతికి పాల్పడినట్లు తేలింది. ఎనిమిది మంది ప్రభుత్వ అధికారులకు చెందిన స్థలాల్లో జరిపిన సోదాల్లో ఏకంగా 37.82 కోట్ల సంపదను రికవర్ అయింది.
ఇవి కూడా చదవండి
మరీ ఇంత దారుణమా.. ఇండియన్స్ నుంచి 22 వేల కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు..
Nagpur Bandit Bride: 8 పెళ్లిళ్లు చేసుకుంది.. 9వ సారి అడ్డంగా దొరికిపోయింది..