Liquor Party In Central Jail: సెంట్రల్ జైల్లో దారుణ పరిస్థితులు.. మందు పార్టీ చేసుకున్న ఖైదీలు..
ABN , Publish Date - Nov 10 , 2025 | 07:05 AM
బెంగళూరు సెంట్రల్ జైలుకు సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఖైదీలకు వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నవారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో భద్రతా వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. శిక్షలు పడి జైల్లో ఉన్నవారిలా కాకుండా.. వెకేషన్‌కు వెళ్లిన వారిలా అక్కడి ఖైదీలు ఎంజాయ్ చేస్తున్నారు. జైల్లో వీవీఐపీ ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 18 మంది ఆడవాళ్లను అతి కిరాతకంగా అత్యాచారం చేసి చంపిన ఉమేష్ రెడ్డి అదే జైల్లో ఉన్నాడు. అతడు జైల్లో ఏకంగా రెండు ఫోన్లు వాడుతున్నాడు. టీవీ చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు.
రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన తరుణ్ రాజుకు కూడా వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఉంది. అతడు తన బ్యారెక్‌లో ఫోన్ వాడటమే కాకుండా.. వంట చేసుకుని మరీ తింటున్నాడు. ఆఖరికి ఐఎస్ఐఎస్‌కు చెందిన వ్యక్తి కూడా జైల్లో ఫోన్ వాడుతూ ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెంట్రల్ జైల్లో భద్రతా లోపంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. జైలు ఉన్నతాధికారులు రెండు రోజుల క్రితం ఈ సంఘటనపై స్పందించారు. తక్షణ దర్యాప్తునకు ఆదేశించారు. ముఖ్యమంత్రి కూడా ఈ సంఘటనపై సీరియస్ అయ్యారు. బాధ్యుల్ని పట్టుకుని, శిక్షిస్తామని చెప్పారు.
జైల్లో మందు పార్టీ..
బెంగళూరు సెంట్రల్ జైలుకు సంబంధించిన ఓ వీడియో నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ బ్యారెక్‌లోని ఖైదీలు మందు పార్టీ చేసుకున్నారు. జైల్లో పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ రెచ్చిపోయారు. ఒకరకంగా ఆ బ్యారెక్ నైట్ క్లబ్‌ను తలపించింది. ఖైదీల కోసం ప్లాస్టిక్ గ్లాసుల్లో మందు, కట్ చేసిన పండ్లు, మసాలా పల్లీలు ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఖైదీలకు వీవీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నవారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అనువాదంతోపాటు అదనపు శ్రమా ఉంటుంది!