Putin to Visit India: 4న భారత్‌కు పుతిన్
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:24 AM
సుదీర్ఘకాలం నుంచి మిత్రదేశాలుగా ఉన్న భారత్, రష్యా సంబంధాలు నూతన శిఖరాలకు చేరనున్నాయి. వచ్చే నెల 4, 5 తేదీల్లో భారత్‌లో పుతిన్ పర్యటించనున్న నేపథ్యంలో...
న్యూఢిల్లీ, నవంబరు 28: సుదీర్ఘకాలం నుంచి మిత్రదేశాలుగా ఉన్న భారత్, రష్యా సంబంధాలు నూతన శిఖరాలకు చేరనున్నాయి. వచ్చే నెల 4, 5 తేదీల్లో భారత్‌లో పుతిన్ పర్యటించనున్న నేపథ్యంలో రక్షణ, దౌత్యపరమైన బంధాలతోపాటు పలు ఇతర అంశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశముంది. భారత్‌లో పుతిన్ పర్యటన వివరాలను విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటించింది. ‘‘ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తారు. 23వ భారత్-రష్యా వార్షిక సదస్సులో పాల్గొంటారు’’ అని వెల్లడించింది. పుతిన్‌కు గౌరవార్థం రాష్ట్రపతి విందు ఇవ్వనున్నట్టు తెలిపింది. భారత్‌పై అమెరికా అడ్డగోలు టారి్‌ఫలు, రష్యాపై ఆంక్షలు, రష్యా చమురు కొనుగోలు చేయవద్దన్న ఒత్తిడుల నేపథ్యంలో.. పుతిన్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌కు మరిన్ని ఎస్-400 క్షిపణి రక్షక వ్యవస్థలు, రెండు స్క్వాడ్రన్ల ఎస్‌యూ-57 ఫైటర్ల సరఫరా, ఇరు దేశాల మధ్య స్థానిక కరెన్సీలో లావాదేవీలు, పౌరఅణుశక్తి రంగంలో మరింత సహకారం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలుకు సంబంధించి కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది.