Soumya Case: జైలు నుంచి పారిపోయిన సౌమ్య మర్డర్ కేసు దోషి
ABN , Publish Date - Jul 25 , 2025 | 04:56 PM
Soumya Case: ఆమె ఫోన్, పర్సు దొంగలించి పారిపోయాడు. కదలలేని స్థితిలో పడున్న ఆమెను స్థానికులు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఫిబ్రవరి 4వ తేదీన పోలీసులు గోవిందచామిని అరెస్ట్ చేశారు.

కేరళలో సంచలనం సృష్టించిన సౌమ్య మర్డర్ కేసు మరో సారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న గోవిందచామి అలియాస్ చార్లీ థామస్ జైలునుంచి తప్పించుకున్నాడు. శుక్రవారం తెల్లవారు జామున కన్నూర్ సెంట్రల్ జైలు నుంచి కనిపించకుండా పోయాడు. అధికారులు రోజూలాగే చెకింగ్ చేస్తుండగా సెల్‌లో అతడు కనిపించలేదు. దీంతో వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. కొన్ని గంటల్లోనే అతడు దొరికిపోయాడు. ఓ బావిలో దాక్కున్న అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.
సౌమ్య కేసు వివరాలు..
కొచ్చికి చెందిన సౌమ్య అనే 23 ఏళ్ల యువతి ఓ షాపింగ్ మాల్‌లో సేల్స్ అసిస్టెంట్‌గా పని చేసేది. 2011, ఫిబ్రవరి 1వ తేదీన ఆమె ఎర్నాకులం నుంచి శోరానుర్ బయలుదేరింది. రైలులోని లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ప్రయాణం చేస్తోంది. కొంతదూరం పోయిన తర్వాత గోవిందచామి ఆ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కాడు. ఒంటరిగా ఉన్న ఆమెపై దాడి చేసి వల్లతాల్ నగర్ స్టేషన్ దగ్గర కిందకు తోసేశాడు. తర్వాత అతడు కూడా కిందకు దూకాడు. రైల్వే లైనుపైనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
తర్వాత ఆమె ఫోన్, పర్సు దొంగలించి పారిపోయాడు. కదలలేని స్థితిలో పడున్న ఆమెను స్థానికులు గుర్తించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఫిబ్రవరి 4వ తేదీన పోలీసులు గోవిందచామిని అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 6వ తేదీన విషాదం చోటుచేసుకుంది. గాయాల కారణంగా సౌమ్య చనిపోయింది. ఈ కేసుకు సంబంధించి 2012లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. అతడికి మరణ శిక్ష విధించింది. అయితే, 2016లో సుప్రీం కోర్టు గోవిందచామిపై ఉన్న హత్యా నేరాన్ని తోసిపుచ్చింది. అతడి కారణంగానే ఆమె చనిపోయిందనడానికి సరైన ఆధారాలు లేవని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
రిషభ్ పంత్.. ఒకప్పటి కుంబ్లేను గుర్తుకుతెచ్చాడు: మాజీల్ ప్రశంసలు
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..