Share News

Kashmir Tourism Shutdown: మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత

ABN , Publish Date - Apr 29 , 2025 | 10:07 AM

కశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందన్న నిఘా వర్గాల అలర్టుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్‌లో పలు టూరిస్టు స్పాట్‌లను మూసివేసింది.

Kashmir Tourism Shutdown: మరిన్ని ఉగ్రదాడులకు ఛాన్స్.. కశ్మీర్‌లో పలు పర్యాటక స్థలాల మూసివేత
Kashmir tourism shutdown

ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కశ్మీర్‌లోని 87 పర్యాటక స్థలాల్లో 48 టూరిస్టు స్పాట్స్‌ను మూసివేసింది.

కశ్మీర్ లోయలో ఉగ్రమూకల స్లీపర్ సెల్స్ క్రియాశీలకంగా మారినట్టు తమ దృష్టికి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన సమాచారం తమ చేతికి అందిందని పేర్కొన్నాయి. మరింత మందిని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రవాదులు సన్నద్ధమవుతున్నట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఇళ్ల ధ్వంసానికి ప్రతిస్పందనగా మరిన్ని దాడులు చేసేందుకు ఉగ్రమూకలు సన్నద్ధమవుతున్నట్టు గుర్తించాయి.


ఈ నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. యాంటీ ఫిదాయీన్ స్క్వాడ్స్, రాష్ట్ర పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్‌ వివిధ పర్యాటక స్థలాలపై నిఘా పెట్టాయి. గుల్‌మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాల్లో భద్రతా దళాలు కట్టుదిట్టమైన చర్యలకు తెర తీసాయి.

పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ..కశ్మీర్‌లో స్థానికేతరులే లక్ష్యంగా దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సీఐడీ సిబ్బందితో పాటు శ్రీనగర్, గండేర్బల్‌లో ఈ డాడులకు ప్లాన్ చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడితో కశ్మీర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత చెలరేగిన విషయం తెలిసిందే. అమాయకులు బలైన ఈ ఘటన కారణంగా కశ్మీర్ నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఆ ప్రాంతాన్ని వీడారు. ఉగ్రదాడి తరువాత పర్యాటకులు మరోసారి కశ్మీర్ చేరుతున్న నేపథ్యంలో నిఘా వర్గాలకు మరిన్ని దాడుల సమాచారం అందడం గమనార్హం.

దాడి మూలాలు తెలుసుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.. క్షేత్రస్థాయిలో విస్తృత దర్యాప్తు చేపడుతోంది. ఘటన జరిగిన తీరుపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి చేసింది. దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ వారితో పాటు ఘటన సమయంలో అక్కడ ఉన్న స్థానిక వర్కర్లను కూడా ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి:

కశ్మీర్‌లో ఐదో రోజూ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించిన పాకిస్తాన్

వేడి నుంచి ఉపశమనం..ఈ ప్రాంతాల్లో మే 3 వరకు వర్షాలు..

మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే

Read More Latest Telugu News and National News

Updated Date - Apr 29 , 2025 | 10:29 AM