Former Police Chief: రక్తపు మడుగులో మాజీ పోలీస్ చీఫ్
ABN , Publish Date - Apr 20 , 2025 | 07:27 PM
మాజీ పోలీస్ చీఫ్ తన ఇంట్లోనే రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయారు. ఆయన శవమై పడి ఉన్న చోట గది మొత్తం రక్తసిక్తం అయినట్టు పోలీసులు చెబుతున్నారు.

Karnatakas Former Police Chief Om Prakash: కర్ణాటక మాజీ పోలీసు చీఫ్(DGP) బెంగళూరు ఇంట్లో మృతి చెందారు. 1981 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS) అధికారి అయిన ఓం ప్రకాష్ రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో ప్రాణాలు కోల్పోయి కనిపించారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. ఓం ప్రకాష్ చనిపోయిన విషయాన్ని ఆయన భార్య పల్లవి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అతని మృతదేహం ఉన్న గది మొత్తం రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి ఆయన భార్య పల్లవి తమకు సమాచారం అందించారని, తాము అక్కడకు వెళ్లే సరికి మృతదేహం స్విమ్మింగ్ పూల్ లో ఉందని పోలీసులు తెలిపారు.
ఆ పూల్ అంతా రక్తంతో నిండి ఉండగా, ఫ్లోర్ కూడా రక్తసిక్తంగా ఉందన్నారు. ఆయనకు గతంలో బెదిరింపు కాల్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది చంపుతామనే బెదిరింపులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తనకు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయాన్ని ఒకానొక సందర్భంలో ఓమ్ ప్రకాష్ కూడా పోలీసులు దృష్టికి తీసుకెళ్లారట. ప్రస్తుతం భార్య పల్లవిని, ఆయన కూతుర్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు.
అయితే, ఈ హత్యలో అతని కుటుంబ సభ్యుడి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఓం ప్రకాష్ బెంగళూరులోని HSR లేఅవుట్‌లో నివసిస్తున్నారు. ఓం ప్రకాష్ మార్చి 2015లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)గా నియమితులయ్యారు. దీనికి ముందు, అతను ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇంకా హోమ్ గార్డ్‌లకు కూడా నాయకత్వం వహించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఓమ్ ప్రకాష్.. జియోలజీలో ఎంఎస్సీ చేశారు. కర్ణాటక రాష్ట్ర డీజీపీగా 2015 మార్చి 1వ తేదీన బాధ్యతలు తీసుకున్నారు.
ఇదిలాఉంటే, ఈ వార్తతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓం ప్రకాష్ ను అతని భార్య హత్య చేసి ఉంటారని కూడా అనుమానాలు వ్యక్తమవుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయం.
ఇవి కూడా చదవండి:
Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది
Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్
UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Read More Business News and Latest Telugu News