Share News

Kangana Ranaut: ట్రంప్‌పై కంగన పోస్టు.. బీజేపీ అధిష్ఠానం చెప్పడంతో ఆ వెంటనే డిలీట్

ABN , Publish Date - May 15 , 2025 | 10:27 PM

ట్రంప్‌ను విమర్శిస్తూ పోస్టు పెట్టిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్.. పార్టీ జాతీయ అధ్యక్షుడి సూచన మేరకు ఆ వెంటనే డిలీట్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా నెట్టింట వెల్లడించారు.

Kangana Ranaut: ట్రంప్‌పై కంగన పోస్టు.. బీజేపీ అధిష్ఠానం చెప్పడంతో ఆ వెంటనే డిలీట్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను విమర్శిస్తూ పోస్టు పెట్టిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఆ వెంటనే డిలీట్ చేశారు. ఇందుకు గల కారణాన్ని కూడా వివరిస్తూ నెట్టింట మరో పోస్టు పెట్టారు. ఐఫోన్‌లను భారత్‌లో తయారు చేయొద్దంటూ యాపిల్ సంస్థ సీఈఓకు ట్రంప్‌ సూచించడంపై స్పందిస్తూ కంగన ఈ పోస్టు పెట్టారు. ట్రంప్ ఇలా మాట్లాడటానికి మూడు కారణాలు ఉండి ఉండొచ్చు. 1. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావచ్చేమో కానీ అత్యధిక మంది అభిమానించే నేత మాత్రం నరేంద్ర మోదీ. 2. ఇది ట్రంప్‌కు అధికారంలో రెండో పర్యాయం కానీ ప్రధాని మోదీ మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 3. ట్రంప్ ఆల్ఫా మేల్ అయ్యుండొచ్చు కానీ ప్రధాని మోదీ అంతకు మించిన వ్యక్తి. ఇది దౌత్యపరమైన భద్రతా లేక వ్యక్తిగతమైన ఈర్ష్య?’’ అంటూ పోస్టు పెట్టి ఆ తరువాత తొలగించారు.


బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకే ఈ పోస్టు తొలగించానని ఆ తరువాత కంగన చెప్పుకొచ్చారు. వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నందుకు చింతిస్తున్నానని అన్నారు. జాతీయ అధ్యక్షుడు తనకు ఫోన్ చేసి ట్వీట్ డిలీట్ చేయమని చెప్పడంతో తక్షణం అలా చేశానని అన్నారు.

భారత్‌లో ఐఫోన్‌ తయారీ కార్యకలాపాలను విస్తరించొద్దంటూ యాపిల్ సీఈఓ టిమ్‌ కుక్‌కు సూచించానని ట్రంప్ చెప్పుకున్న విషయం తెలిసిందే. ‘‘నేనెప్పుడూ మీతో మంచిగానే వ్యవహరించాను. కానీ మీరు ఐఫోన్ కార్యకలాపాలను భారత్‌లో విస్తరిస్తున్నట్టు నాకు తెలిసింది. అలా చేయొద్దు. ఇండియా కోసం కావాలంటే మీరు అక్కడ తయారీని చేపట్టొచ్చు కానీ అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఇండియా కూడా ఒకటి. అక్కడ మన ఉత్పత్తులను విక్రయించడం చాలా కష్టం’’ అని టిమ్‌ కుక్‌తో అన్నట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందీ మాత్రం ట్రంప్ చెప్పలేదు.


ఇక అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై తాజా విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందించారు. ఏ ఒప్పందమైనా ఇరు దేశాలకు లాభం చేకూర్చాలని అన్నారు.

Also Read:

తుర్కియే సంస్థ సెలెబీ ఏవియేషన్‌ అనుమతులు రద్దు.. కేంద్రం కీలక నిర్ణయం..

టర్కీ నుంచి దిగుమతులు ఆగిపోతే.. వీటి రేట్లు విపరీతంగా పెరుగుతాయి

కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 15 , 2025 | 11:11 PM