Jodhpur: పెళ్లి కోసం పసికందు బలి
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:01 AM
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం 16 రోజుల వయసున్న పసికందును నలుగురు యువతులు కాళ్లతో తొక్కి చంపారు.
కాళ్లతో తొక్కి చంపిన నలుగురు యువతులు
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఘటన
జైపూర్, నవంబరు 16: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం 16 రోజుల వయసున్న పసికందును నలుగురు యువతులు కాళ్లతో తొక్కి చంపారు. పెళ్లిళ్లు కావడం లేదనే నిరాశతో, కొడుకు వరుసయ్యే ఆ శిశువును బలిస్తే తమకు సంబంధాలు వస్తాయని నమ్మి వారు ఈ దారుణానికి పాల్పడినట్లు బాలుడి తండ్రి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలో, మహిళల్లో ఒకరు పసికందును ఒడిలో పెట్టుకుని మంత్రాలు జపిస్తోంది. ఆమె చుట్టూ కూర్చున్న మిగతా మహిళలు కూడా ఆ జపంలో పాలుపంచుకున్నారు. స్థానిక దేవత అయిన భైరును ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ తంతు చేసినట్లు అధికారులు తెలిపారు. తన కొడుకును చంపిన హంతకులను కఠినంగా శిక్షించాలని బాలుడి తండ్రి డిమాండ్ చేశారు.