Share News

Road Accident: ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Jul 30 , 2025 | 06:11 AM

ఝార్ఖండ్‌లోని దేవగఢ్‌ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వర్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఓ

Road Accident: ఝార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

  • కన్వర్‌ యాత్రికుల బస్సును ఢీకొన్న ట్రక్కు..18 మంది మృతి

రాంచీ, జూలై 29: ఝార్ఖండ్‌లోని దేవగఢ్‌ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్వర్‌ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీ కొనడంతో 18 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. ఝార్ఖండ్‌లో ప్రతి ఏడాది ఈ సమయంలో శ్రావణి మేళా జరుగుతుంది. ఈ సందర్భంగా దేవగఢ్‌లోని బాబా బైద్యనాథ్‌ ధామ్‌ ఆలయానికి భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలో 35 మంది భక్తులు బస్సులో బైద్యనాధ్‌ ఆలయానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు జామునియా గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా ఎల్పీజీ సిలిండర్లతో వస్తున్న ట్రక్కు ఢీ కొట్టింది. ట్రక్కు ఢీ కొట్టిన వేగానికి బస్సు బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో 18 మంది భక్తులు మృతి చెందారు, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Updated Date - Jul 30 , 2025 | 06:11 AM