Share News

Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా

ABN , Publish Date - Jul 21 , 2025 | 09:47 PM

ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ధన్‌ఖడ్ ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.

Jagdeep Dhankar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) రాజీనామా చేసారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆరోగ్యానికి తాను ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు.


ఆరోగ్యం, మెడికల్ అడ్వయిజరీని పరిగణనలోకి తీసుకుని తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, రాజ్యాంగంలోని 67(ఎ) నిబంధన కింద తక్షణం తన రాజీనామాను ఆమోదించాలని రాష్ట్రపతిని జగదీప్ ధన్‌ఖడ్ కోరారు. విధుల నిర్వహణలో తనకు సహకరించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అందించిన సహకారం తాను మరువలేనని అన్నారు. వారినుంచి తానెంతో నేర్చుకున్నానని చెప్పారు. పార్లమెంటు సభ్యులందరూ తనపై చూపించిన ఆదరణ, విశ్వాసం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటానని చెప్పారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఉపరాష్ట్రపతిగా తాను పొందిన విలువైన అనుభవాలు మరువలేనని, ఇందుకుగాను అందరికీ తన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పేర్కొన్నారు.


ఆరోగ్యం విషయంలో ఆందోళన

కాగా, జగ్‌దీప్ ధన్‌ఖడ్ గత జూన్‌లో నైనిటాల్‌లో జరిగిన కుమావూ యూనివర్శిటీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్‌లో సొమ్మసిల్లిపోయారు. ఆయన ప్రసంగిస్తూ భావోద్వేగంతో మాజీ ఎంపీ మహేంద్ర సింగ్ పాల్‌ను ఆలింగనం చేసుకున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే వైద్యుల బృందం వెంటనే స్పందించడంతో ఆయన కోలుకున్నారు. అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. దీనికి ముందు మార్చిలో హృద్రోగ సంబంధిత సమస్యలతో ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స ఆనంతరం మార్చి 12 డిశ్చార్జి అయ్యారు.


ఇవి కూడా చదవండి..

సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

విమాన ప్రమాదంపై పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 21 , 2025 | 10:21 PM