Sarvam AI: మన సర్వం ఏఐ వచ్చేస్తోంది.. ఇక దూసుకెళ్లడమే
ABN , Publish Date - Apr 26 , 2025 | 10:13 PM
వాస్తవంగా అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే, భారతదేశంలోనే ప్రాచీన భాషలు, మాండలికాలు చాలా పురాతన కాలం నుంచే ఉన్నాయి. ఈ 'సర్వం ఏఐ' ఫలితంగా భారత దేశంలోని అత్యంత ప్రాచీన భాషా నేపథ్యం..

Sarvam AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమాని మొత్తం ప్రపంచం ట్రెండే మారిపోతోంది. మనకేం సమాచారం కావాలన్నా చిటికెలో మన ముందుండే కాలం(గూగుల్ తల్లికంటే గొప్పగా)కి మనం వచ్చేశాం. ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నడుస్తోన్న సంగతి మనకందరికీ తెలిసిందే. దీనిని గ్లోబల్ గా లీడ్ చేస్తున్న సంస్థలు అమెరికా బేస్ ఉన్న చాట్ జీపీటీ, 'ఎక్స్' గోర్క్ తదితరాలు. మరి మన సంగతేంటి? ఇండియా ప్రజలంతా ప్రతీ విషయానికీ గ్లోబల్ వ్యవస్థలైన పై ఫ్లాట్ ఫాం లను ఆశ్రయించడమే కాదు కదా.. మనకంటూ ఇలాంటి ఒక వ్యవస్థ ఉండాలి. అందుకే మన భారత్ కూడా ఇలాంటి వ్యవస్థను తయారు చేసే దానికోసం స్టార్ట్ అప్ లను ఆహ్వానించింది.
ఫిబ్రవరి 15 నుండి వచ్చిన 67 ప్రతిపాదనలలో, 'సర్వం AI' అనే సంస్థ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ బేస్డ్ మోడల్ను అభివృద్ధి చేయడానికి ఎంపిక చేయబడిన మొదటి స్టార్టప్. దీనిని భారత ప్రభుత్వం సావరిన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs) నిర్మించడానికి ఎంపిక చేసింది. ఇది.. విభిన్న భారతీయ డేటాసెట్‌లపై, లేదా భారతీయ భాషలలో తార్కానికి సపోర్ట్ చేసే స్వదేశీ బేస్డ్ AI మోడల్. దీనిని 'సర్వం AI' అనే స్వదేశీ సంస్థ త్వరలోనే భారతీయులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది.
వాస్తవంగా అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే, భారతదేశంలోనే ప్రాచీన భాషలు, మాండలికాలు చాలా పురాతన కాలం నుంచే ఉన్నాయి. ఈ 'సర్వం ఏఐ' ఫలితంగా భారత దేశంలోని అత్యంత ప్రాచీన భాషా నేపథ్యం, వాటి చరిత్ర, వాటి తీరు, లిపి, వాటి పుట్టు పూర్వత్రాలు తదితర సర్వ విషయాలు ఇట్టే మనముందుండే అవకాశం ఇకపై భారతీయులకు కలుగుతుంది. ఫలితంగా మన దేశ వారసత్వ సంపద ఎంత గొప్పదో ప్రతీ భారతీయుడికీ చిటెకెలో తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
భారతీయ భాషలలో తార్కికతకు మద్దతు ఇచ్చే భారతదేశ ప్రాథమిక AI మోడల్ ఆరు నెలల్లో సిద్ధంగా ఉంటుందని సర్వం AI వ్యవస్థాపకులు వివేక్ రాఘవన్ చెప్పారు. అది తాము నిర్దేశించుకున్న అంతర్గత లక్ష్యమని(టైం లైన్) రాఘవన్ తెలిపారు. “వాస్తవానికి మేము భారతీయ భాషలలో(Indic languages) తార్కికతను నిర్మిస్తున్నాము” అని రాఘవన్ వెల్లడించారు. “కాబట్టి, మీరు ఏ భాషలోనైనా, ఏ లిపిలోనైనా ప్రశ్నలు అడగవచ్చు, అది దేవనాగరి లేదా రోమన్ లిపి హింద్ అయినా, మన మోడల్ ప్రతిస్పందిస్తుంది." అని చెప్పారు.
“మేము వివిధ రకాల భారతీయ డేటాను ఉపయోగించుకునే మోడల్ నిర్మిస్తున్నాము... అదే మేము చేస్తున్న పని,” అని రాఘవన్ అన్నారు. “ఇది సాధారణ-ప్రయోజన, బహుళ-మోడల్, వాయిస్, చిత్రాలు, టెక్స్ట్, అన్నీ కలిగి ఉంటుంది.” అని రాఘవన్ వెల్లడించారు.
సావరిన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (Sovereign Large Language Models) అనేవి ఒక దేశం లేదా సంస్థ యొక్క నియంత్రణలో అభివృద్ధి చేయబడిన, నిర్వహించబడే అధునాతన కృత్రిమ మేధస్సు (AI) భాషా నమూనాలు. ఈ మోడల్స్ స్వతంత్రంగా పనిచేస్తాయి. అంటే వాటి డేటా, శిక్షణ, ఉపయోగం పూర్తిగా స్థానిక నియమాలు, గోప్యతా విధానాలు, భద్రతా ప్రమాణాలకు లోబడి ఉంటాయి. సావరిన్ LLMలు డిజిటల్ స్వాతంత్ర్యం, సాంకేతిక స్వావలంబనను ప్రోత్సహిస్తాయి, అయితే, వీటి విజయం స్థానిక వనరులు, వ్యూహాత్మక పెట్టుబడులపై ఆధారపడి ఉంటుంది.
Also Read:
విద్యార్థినులు నడుస్తూ వెళ్తుండగా.. ఏమైందో చూస్తే..
ఇండియా నుంచి వెళ్లిపోయిన కోహ్లీ ఫ్యామిలీ?
For More Andhra Pradesh News and Telugu News..