Share News

Defense Deal: మీ ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్లు మాకొద్దు..

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:23 AM

సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్‌ దూకుడుకు దీటుగా బదులిచ్చేందుకు మన దేశం సిద్ధమైంది. భారత్‌ వస్తువులపై 25ు సుంకాలు వేసిన అమెరికా నుంచి ఎఫ్‌-35 స్టెల్త్‌ ఫైటర్‌ జెట్లు కొనుగోలు చేయకూడదని భావిస్తున్నట్లు తెలిసింది.

Defense Deal: మీ ఎఫ్‌-35 ఫైటర్‌ జెట్లు మాకొద్దు..

  • సుంకాల నేపథ్యంలో అమెరికాతో డీల్‌పై భారత్‌ అనాసక్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 2: సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్‌ దూకుడుకు దీటుగా బదులిచ్చేందుకు మన దేశం సిద్ధమైంది. భారత్‌ వస్తువులపై 25ు సుంకాలు వేసిన అమెరికా నుంచి ఎఫ్‌-35 స్టెల్త్‌ ఫైటర్‌ జెట్లు కొనుగోలు చేయకూడదని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ‘మీ ఐదో తరం ఎఫ్‌-35 యుద్ధవిమానాల కొనుగోలుపై మాకు ఆసక్తిలేదు’ అని అమెరికా అధికారులకు భారత్‌ స్పష్టం చేసినట్లు తాజాగా బ్లూమ్‌బర్గ్‌ నివేదిక వెల్లడించింది. ఇకపై అమెరికాతో ప్రధాన రక్షణ ఒప్పందాలకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం లేదని ఆ నివేదిక స్పష్టం చేసింది. మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏదైనా భాగస్వామ్యంతో దేశీయంగా ఆయుధాల తయారీపై భారత్‌ పెద్దఎత్తున దృష్టి పెట్టిందని పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినపుడు ఎఫ్‌-35లను విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. ట్రంప్‌ కూడా ఆ విషయాన్ని వెల్లడించారు. ఆ యుద్ధ విమానాలు ఓ చెత్త అంటూ గతంలో ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ విపక్ష కాంగ్రెస్‌.. మోదీ సర్కార్‌పై అప్పట్లో విమర్శలు చేసింది.

Updated Date - Aug 03 , 2025 | 06:23 AM