Droupadi Murmu: భారత అంతరిక్ష చరిత్రలో నూతన మైలురాయి
ABN , Publish Date - Jun 26 , 2025 | 06:11 AM
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రపై యావత్తు దేశం హర్షం వ్యక్తం చేసింది. యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న శుభాన్షు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో ఓ కొత్త మైలురాయిని సృష్టించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలియజేశారు.

శుక్లా అంతరిక్ష యాత్రపై రాష్ట్రపతి ముర్ము
140 కోట్ల మంది భారతీయుల ఆశలు మోసుకెళ్లిన శుభాన్షు : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, జూన్ 25 : భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతరిక్ష యాత్రపై యావత్తు దేశం హర్షం వ్యక్తం చేసింది. యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న శుభాన్షు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో ఓ కొత్త మైలురాయిని సృష్టించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలియజేశారు. ‘గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్షా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని సృష్టించారు. దీనిపై దేశమంతా గర్విస్తోంది. నాసా, ఇస్రో మధ్య భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే యాక్సియం-4 మిషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అని ద్రౌపది ముర్ము ఎక్స్‌లో పోస్టు చేశారు. కాగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా నిలిచిన శుభాన్షు శుక్లా తన వెంట 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకెళ్లారంటూ ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇక శుభాన్షు అంతరిక్ష యాత్రపై భారత వాయుసేన కూడా హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడైన రాకేశ్ శర్మ.. శుభాన్షు శుక్లాతోపాటు యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న వ్యోమగాములకు శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యోమగాములంతా ఈ యాత్రను ఆస్వాదించాలని, వీలైనంత ఎక్కువ సేపు అంతరిక్షం నుంచి ప్రపంచాన్ని చూడాలని చెప్పారు. శుభాన్షు శుక్షా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లడం గర్వకారణమని ఆయన తల్లిదండ్రులు శంభు శుక్లా, ఆశా శుక్లా పేర్కొన్నారు.