Share News

Stolen Artifacts: ఐదేళ్లలో 610 కళాఖండాలు స్వాధీనం

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:44 AM

గత ఐదేళ్లలో ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, థాయిలాండ్‌, యూకే, యూఎస్ఏ నుంచి మొత్తం 610 భారతీయ కళాఖండాలను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర సాంస్కృతిక...

Stolen Artifacts: ఐదేళ్లలో 610 కళాఖండాలు స్వాధీనం

  • భారత్‌లో క్రిప్టోపై నియంత్రణ లేదు: లోక్‌సభలో కేంద్రం

న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, థాయిలాండ్‌, యూకే, యూఎస్ఏ నుంచి మొత్తం 610 భారతీయ కళాఖండాలను స్వాధీనం చేసుకున్నామని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తెలిపారు. సోమవారం, లోక్‌సభలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గోలింగేశ్వర ఆలయానికి చెందిన నంది శిల్పాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. అక్రమ విదేశీ క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ మహేష్‌ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో క్రిప్టో కరెన్సీ లేదా వర్చువల్‌ ఆస్తులు నియంత్రణలో లేవని, ఈ కారణంగా ఏ ప్లాట్‌ఫామ్‌ చట్టబద్ధమో, చట్టవిరుద్ధమో అనే అంశం స్పష్టంగా నిర్ణయించబడలేదని పేర్కొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 06:46 AM