Share News

India responds : సుంకాలు గమనిస్తున్నాం.. : భారత్

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:25 PM

IND Vs USA: అమెరికా సుంకాలపై భారత్ స్పందించింది. అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేదానిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది.

India responds : సుంకాలు గమనిస్తున్నాం.. : భారత్
modi

ఇంటర్నెట్ డెస్క్, జులై 31: అమెరికా సుంకాలపై భారత్ స్పందించింది. అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేదానిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. ఈ వ్యవహారంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. రైతులు, వ్యాపారవేత్తలతోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రం చెప్పుకొచ్చింది.


కొద్దిసేపటికే పాకిస్థాన్‌‌తో..

భారత్‌పై సుంకాలు విధించిన కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌కు శత్రుదేశామైన పాకిస్థాన్‌తో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. పాక్‌లో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్టు ప్రకటనలో చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో పాకిస్థాన్ నుంచి కూడా భారత దేశం చమురును కొనుకునే అవకాశం ఉంటుందని ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


భారత్‌పై మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వక్రబుద్ధి ప్రదర్శించారు. భారత్‌పై 25 శాతం సుంకాలు విధింస్తూ.. ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్ భారత్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రష్యా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఇరాన్ చమురు ఉత్పత్తులను భారత కంపెనీలు మార్కెటింగ్ చేస్తున్నాయని తెలిపారు.

రష్యాతో భారత్ ఏ వ్యాపారం చేసుకున్నా తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని రష్యాకు అన్ని దేశాలు చెబుతుంటే.. యుద్ధ సమయంలో కూడా భారత్, చైనా మాత్రం రష్యా నుంచి చమురు కొంటున్నాయని విమర్శించారు. భారత్‌పై ప్రకటించిన 25 శాతం సుంకాలు రేపటి(ఆగస్టు 1) నుంచి అమల్లోకి రానున్నాయి అని ట్రూత్‌ సోషల్‌ వేదికగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

శివుడితో కామెడీ చేస్తే ఇలాగే ఉంటుంది.. ఎలాంటి ప్రతిఫలం దక్కిందంటే..

ఈ భర్తను చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.. బైకుపై భార్య ఏం చేస్తుందో చూస్తే..

Updated Date - Jul 31 , 2025 | 12:26 PM