IIM Calcutta Student: ఐఐఎమ్ కోల్‌కతాలో దారుణం.. బాయ్స్ హాస్టల్‌లో యువతిపై అత్యాచారం..
ABN , Publish Date - Jul 12 , 2025 | 01:30 PM
IIM Calcutta Student: గత కొంత కాలంనుంచి ఆ యువతికి తోటి విద్యార్థినితో గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి యువతి సెకండ్ ఇయర్ యువకుడికి ఫోన్ చేసింది. విషయం చెప్పి ఏం చేయాలో సలహా అడిగింది. ‘ఈ విషయం గురించి చర్చిద్దాం.. మా హాస్టల్‌కు వచ్చేయ్’అని అన్నాడు.

పశ్చిమ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు.. యువతిపై అత్యాచారం చేశాడు. ఐఐఎమ్ బాయ్స్ హాస్టల్‌లో ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో దారుణం వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. ఓ యువతి కోల్‌కతా ఐఐఎమ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. యువతికి సెకండ్ ఇయర్ చదివే యువకుడితో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది. ఇద్దరూ తరచుగా చాటింగ్, ఫోన్లు చేసుకునేవారు.
గత కొంత కాలంనుంచి ఆ యువతికి తోటి విద్యార్థినితో గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి యువతి సెకండ్ ఇయర్ యువకుడికి ఫోన్ చేసింది. విషయం చెప్పి ఏం చేయాలో సలహా అడిగింది. ‘ఈ విషయం గురించి చర్చిద్దాం.. మా హాస్టల్‌కు వచ్చేయ్’అని అన్నాడు. అమె అతడ్ని గుడ్డిగా నమ్మింది. మరో స్నేహితురాలిని వెంట బెట్టుకుని అక్కడికి వెళ్లింది. ఒంటరిగా మాట్లాడదాం అని చెప్పి.. ఆ యువకుడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లిన తర్వాత తినడానికి తిండి, తాగడానికి కూల్ డ్రింక్స్ ఇచ్చాడు.
అతడు పెట్టిన ఆహారం తినగానే ఆమె స్ప్రహ కోల్పోయింది. తర్వాత అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. యువతి అతడి బెదిరింపులకు భయపడలేదు. అక్కడినుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజు రాత్రి ఐఐఎమ్ హాస్టల్‌లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
నటి గొప్ప మనసు.. తోటి నటి హుమైరా అంత్యక్రియల చేస్తానంటూ..
ఫోన్ దొంగతనం.. కట్ చేస్తే భార్య ఎఫైర్ బయటపడింది..