Tapan Deka: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు
ABN , Publish Date - May 20 , 2025 | 09:15 PM
ఈ ఏడాది జూన్ 30న తపన్ కుమార్ డేకా పదవీ విరమణ చేయాల్సి అంది. కాగా, ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ పొడిగిస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారంనాడు ఒక అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంజెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్ తపన్ కుమార్ డేకా (Tapan Kumar Deka) పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించింది. ఆయన పదవీకాలం పొడిగింపునకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ (ACC) ఆమోదం తెలిపింది.
Ranya Rao: బంగారం స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిల్.. అయినా
ఈ ఏడాది జూన్ 30న తపన్ కుమార్ డేకా పదవీ విరమణ చేయాల్సి అంది. కాగా, ఆయన పదవీకాలాన్ని ఏడాది పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకూ పొడిగిస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారంనాడు ఒక అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ అధికారి అయిన డేకా.. 2022లో రెండేళ్ల కాలానికి ఐబీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2023లో ఆయన పదవీకాలాలన్ని పొడిగించారు. అది ఈ ఏడాది జూన్‌తో ముగియాల్సి ఉండటంతో మరో ఏడాది పదవీకాలాన్ని పొడిగించారు. భారతదేశ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీలో ఆయనకు విశేషానుభవం ఉంది. టెర్రరిస్టు నెట్‌వర్క్‌లు, తిరుగుబాటు గ్రూపులను టార్గెట్ చేయడంతో పాటు పలు ఆపరేషన్‌లో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2008 ముంబై ఉగ్రదాడి సమయంలో కౌంటర్ ఆపరేషన్‌కు బాధ్యత వహించారు.
ఇవి కూడా చదవండి..
Shashi Tharoor: ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ
Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్డేట్..యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి