Rahul Fazilpuria: సింగర్‌పై అగంతకుల కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Jul 14 , 2025 | 09:43 PM
ఫాజిల్‌పురియాపై కాల్పులు జరగడంతో తాము అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్టు గురుగావ్ పోలీసులు తెలిపారు. అంగతకులు ఒక రౌండ్ కాల్పులు జరిపినట్టు చెప్పారు.

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్, హర్యానీ గాయకుడు రాహుల్ ఫాజిల్‌పురియా (Fazilpuria)పై గురుగావ్ లో గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం నాడు కాల్పులు జరిపారు. సదరన్ పెరిఫెరల్ రోడ్డు (ఎస్‌పీఆర్)లోని బాద్‌షాపూర్ సమీపంలో ఆయనపై కాల్పులు జరగగా.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
సంఘటన వివరాల ప్రకారం, కొందరు గుర్తుతెలియని వ్యక్తులు టాటా పుంచ్ కారులో వచ్చి ఫాజిల్‌పురియాపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన ఆయన వేగంగా కారు నడుపుతూ అక్కడ్నించి ముందుకు వెళ్లిపోయారు. గురుగావ్ పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, ఒక సింగర్‌ను టార్గెట్ చేసేందుకు దుండగులు ప్లాన్ చేస్తున్నట్టు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు ఇటీవల సమాచారం అందినట్టు తెలుస్తోంది. తాజాగా ఫాజిల్‌పురియాపై కాల్పులు జరగడంతో తాము అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నట్టు గురుగావ్ పోలీసులు తెలిపారు. అగంతకులు ఒక రౌండ్ కాల్పులు జరిపినట్టు చెప్పారు. ఫాజిల్‌పురియా 'కర్ గయి ఛుల్', '2 మెనీ గర్ల్స్', '32 బోర్' వంటి పాపులర్ సాంగ్స్ పాడారు.
ఇవి కూడా చదవండి..
ఆసుపత్రిలో చేరిన సీజేఐ బీఆర్ గవాయ్
నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి