Share News

SIM Binding: సిమ్ ఉంటేనే సేవలు.. వాట్సప్, టెలిగ్రాంలకు కేంద్రం కీలక ఆదేశాలు

ABN , Publish Date - Nov 29 , 2025 | 09:16 PM

కమ్యూనికేషన్ యాప్‌లు దుర్వినియోగం కాకుండా నిత్యం సిమ్ కార్డుతో అనుసంధానం అయ్యేలా చూడటమే తాజా చర్యల ఉద్దేశంగా డీఓటీ తెలిపింది. ప్రస్తుతం చాలా సర్వీసులు ఇన్‌స్టలేషన్ సమయంలో యూజర్ మెబైల్ నంబర్‌ను ప్రమాణంగా తీసుకుంటున్నాయి.

SIM Binding: సిమ్ ఉంటేనే సేవలు.. వాట్సప్, టెలిగ్రాంలకు కేంద్రం కీలక ఆదేశాలు
SIM Binding

న్యూఢిల్లీ: వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై వంటి కమ్యూనికేషన్ యాప్స్‌కు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. డివైజ్‌లో సిమ్ కార్డు ఉంటేనే (SIM Binding) యాప్ సర్వీసులు పనిచేసేలా చూడాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) సూచించింది. యాప్ ఆధారిత కమ్యూనికేషన్ సేవలందించే సంస్థలకు న్యూ టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు-2025లో భాగంగా ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధనలు 90 రోజుల్లోగా అమలు చేయాలని కమ్యూనికేషన్ యాప్స్‌ను ఆదేశించింది.


కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్‌లను టెలికమ్యూనికేషన్ ఐడెంటిఫైర్ యూజర్ ఎంటిటీస్ (TIUEs)గా అధికారికంగా వర్గీకరించారు. వెబ్ బ్రైజర్ ద్వారా లాగిన్ అయ్యే యూజర్లకు డీఓటీ కీలక మార్పు చేసింది. వెబ్ బ్రౌజర్‌లో ఈ సేవలను ఉపయోగించే వారు సదరు ప్లాట్‌ఫామ్ ప్రతి 6 గంటలకు లాకౌట్ చేయాలి. తిరిగి సేవలు పొందాలంటే క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే లాగిన్ కావాల్సి ఉంటుంది. యూజర్ ఏ సిమ్‌తో అకౌంట్ రిజిస్టర్ చేశారో ఆ సిమ్‌ ఫోనులో ఉంటేనే యాప్ పనిచేస్తుంది. సిమ్ తీసేసినా, ఫోన్ మార్చినా యాప్ ఆటోమాటిక్‌గా లాగౌట్ అవుతుంది.


కమ్యూనికేషన్ యాప్‌లు దుర్వినియోగం కాకుండా నిత్యం సిమ్ కార్డుతో అనుసంధానం అయ్యేలా చూడటమే తాజా చర్యల ఉద్దేశంగా డీఓటీ తెలిపింది. ప్రస్తుతం చాలా సర్వీసులు ఇన్‌స్టలేషన్ సమయంలో యూజర్ మెబైల్ నంబర్‌ను ప్రమాణంగా తీసుకుంటున్నాయి. ఆ తర్వాత సిమ్ తీసేసినా, డీయాక్టివేట్ చేసినా యాప్‌ సర్వీసులు కొనసాగుతున్నాయి. దీంతో స్విచ్చింగ్, డీయాక్టివేటింగ్ తర్వాత కూడా ఈ యాప్స్‌ను ఇతర దేశాల్లో ఉండే సైకర్ నేరగాళ్లు ఉపయోగించుకుంటున్నారు. సిమ్ బైడింగ్ విధానంగా మోసపూరిత కార్యకలాపాలు తగ్గుతాయని సైబర్ నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

గ్యాంగ్‌స్టర్ అన్మోల్ బిష్ణోయ్ ఎన్ఐఏ కస్టడీ డిసెంబర్ 5 వరకూ పొడిగింపు

ఈడీ ఛార్జిషీటుపై నిర్ణయాన్ని డిసెంబర్ 16కు వాయిదా వేసిన కోర్టు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 29 , 2025 | 09:23 PM