PM Kisan: పీఎం-కిసాన్ 20వ ఇన్‌స్టాల్‌మెంట్.. ఖాతాల్లో డబ్బులు పడాలంటే ఇలా చేయాల్సిందే..
ABN , Publish Date - Jun 18 , 2025 | 11:52 AM
దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది.

దేశంలోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan). రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఏడాదికి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తోంది. విడతకు రూ.2 వేలు చొప్పున ఏడాదిలో మూడు సార్లు అందిస్తోంది (PM-KISAN 20th instalment).
ఇప్పటి వరకు 19 విడతల్లో రూ.2 వేల చొప్పున కోట్లాది మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇక, 20వ విడత పీఎం-కిసాన్ నిధుల విడుదలకు సమయం ఆసన్నమైంది. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటివరకు 20వ విడత పీఎం-కిసాన్ నిధుల విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే జూన్ 20వ తేదీన రైతుల ఖాతాల్లోకి 20వ విడత పీఎం-కిసాన్ నిధులు జమ అవుతాయని సమాచారం.
మరి, ఈ 20వ విడత పీఎం-కిసాన్ నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా రెండు పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది తప్పనిసరిగా ఇ-కేవైసీ పూర్తి చేసి ఉండడం. రెండోది బ్యాంక్ ఖాతాతో ఆధార్ నంబర్ లింక్ చేసుకుని ఉండడం. ఈ రెండు పనులు పూర్తి చేయడంలో విఫలమైతే పీఎం-కిసాన్ డబ్బులు అందుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి, సాధ్యమైనంత త్వరగా ఈ రెండు పనులను పూర్తి చేసుకోవాలని రైతులకు అధికారులకు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ట్రంప్‌కు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ
యోగా డే ముందు రచ్చకు వైసీపీ బిగ్ ప్లాన్
For More National News and Telugu News