ICAR Chief Ayyappan: విషాదం.. కావేరీ నదిలో శవమై తేలిన ICAR మాజీ చీఫ్
ABN , Publish Date - May 11 , 2025 | 01:17 PM
Former ICAR Chief: నాన్ క్రాప్ విభాగం నుంచి ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు డైరెక్టర్ జనరల్ అయిన మొదటి వ్యక్తి సుబ్బన్న అయ్యప్పన్ కావటం విశేషం. ఆయన వ్యవసాయం, మత్స్య సంపద శాస్త్రవేత్తగా ఎన్నో సేవలు అందించారు.

ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) మాజీ డైరెక్టర్ జనరల్.. పద్మ శ్రీ అవార్డు గ్రహీత సుబ్బన్న అయ్యప్పన్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. కావేరీ నదిలో ఆయన మృతదేహం లభించింది. శనివారం శ్రీరంగపట్నం దగ్గరలో.. నదిలో తేలుతున్న ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయ్యప్పన్ మృతదేహాన్ని నీటిలోంచి బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై స్పందిస్తూ.. ‘ నది ఒడ్డున ఓ టూవీలర్ ఆపి ఉంది. ఆయన ఇక్కడికి వచ్చి నదిలో దూకి ఉండొచ్చని అనుమానిస్తున్నాము. ఏది ఏమైనప్పటికి దర్యాప్తులో ఆయన చావుకు సంబంధించిన అసలైన కారణాలు బయటపడతాయి’ అని అన్నారు.
చరిత్రలో మొదటి వ్యక్తి..
నాన్ క్రాప్ విభాగం నుంచి ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు డైరెక్టర్ జనరల్ అయిన మొదటి వ్యక్తి సుబ్బన్న అయ్యప్పన్ కావటం విశేషం. ఆయన వ్యవసాయం, మత్స్య సంపద శాస్త్రవేత్తగా ఎన్నో సేవలు అందించారు. భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి.. పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరావటం లేదు. ఆయన మే 7వ తేదీన ఇంటినుంచి కనిపించకుండా పోయారు. కావేరీ నదిలో శవమై తేలారు.
ఇవి కూడా చదవండి
Operation Sindoor: పాక్ మంత్రి తప్పుడు ప్రచారం.. మరీ ఇంత దిగజారాలా..
ChatGPT Claims: చాట్ జీపీటీ చెప్పిందని భర్తకు విడాకులు ఇచ్చిన మహిళ