Share News

Air India Flight Fire: ఎయిరిండియా విమానంలో మంటలు

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:23 AM

మంగళవారం హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం

Air India Flight Fire: ఎయిరిండియా విమానంలో మంటలు

  • హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం

  • సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు

న్యూఢిల్లీ, జూలై 22: మంగళవారం హాంకాంగ్‌ నుంచి ఢిల్లీకి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం(ఏ321)లో స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం 12.12 గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం దిగిన కొద్దిసేపటికే ఆక్సిలరీ పవర్‌ యూనిట్‌ (ఏపీయూ)లో మంటలు చెలరేగాయి. అయితే విమానంలోని సాంకేతిక వ్యవస్థల కారణంగా ఏపీయూ ఆటోమేటిక్‌గా మూసుకుపోవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులందరూ విమానంలోంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటనలో విమానం స్వల్పంగా దెబ్బతిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 03:24 AM