Sukma District: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Nov 17 , 2025 | 04:54 AM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బెజ్జి, చింతగుప్ప పోలీసు స్టేషన్ల పరిధిలోని తుమ్మలపాడు అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో
ముగ్గురు మావోయిస్టులు మృతి
చింతూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బెజ్జి, చింతగుప్ప పోలీసు స్టేషన్ల పరిధిలోని తుమ్మలపాడు అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. తుమ్మలపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉందన్న సమాచారం అందుకున్న డిస్ట్రిక్ట్ రిజర్వ్‌డ్ గ్రూప్స్ (డీఆర్‌జీ) బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరుపక్షాల నడుమ ఎదురుకాల్పులు జరిగినట్టు సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ పేర్కొన్నారు. కాల్పుల్లో కుంట ఏరియా కమిటీ జన్ మిలీషియా కమాండర్ మడవి దేవా, కిష్టారం ఏరియా కమిటీ ఏసీఎం సోడి గంగి, కుంట ఏరియా కమిటీ ఏసీఎం పొడియం గంగి మృతి చెందినట్టు పోలీసులు ధ్రువీకరిం చారు. వీరి తలలపై ఒక్కొక్కరికి రూ.5 లక్షల వంతున రివార్డు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల కుంట ఏఎస్పీ ఆకా్‌షరావ్ గిరిపుంజను హత్య చేసిన ఘటనలో ప్రధాన పాత్ర మడవి దేవాదేనని పోలీసుల కథనం. ఘటనా స్థలంలో ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలను, 303 రైఫిల్, బీజీఎల్ లాంచర్లు, పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు