Share News

Cough Syrup Racket Case: దగ్గు మందు కేసు.. కానిస్టేబుల్ ఇల్లు చూసి ఈడీ షాక్‌

ABN , Publish Date - Dec 15 , 2025 | 12:53 PM

దగ్గు మందు రాకెట్ కేసుతో సంబంధం ఉన్న ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ అలోక్‌ను కొద్దిరోజుల క్రితం అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, లక్నోలోని అతడి ఇంటిపై రైడ్ చేశారు. అత్యంత ఖరీదైన అతడి ఇంటిని చూసి అధికారులే షాక్ అయ్యారు.

Cough Syrup Racket Case: దగ్గు మందు కేసు.. కానిస్టేబుల్ ఇల్లు చూసి ఈడీ షాక్‌
Cough Syrup Racket Case

దగ్గు మందు రాకెట్ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీస్ కానిస్టేబుల్ అలోక్‌ను కొద్దిరోజుల క్రితం అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, లక్నోలోని అతడి ఇంటిపై రైడ్ చేశారు. అత్యంత ఖరీదైన అతడి ఇంటిని చూసి అధికారులే షాక్ అయ్యారు. ఆ ఇంటి విలువ ఏడు కోట్ల రూపాయలుగా గుర్తించారు. అత్యంత ఖరీదైన పలు వస్తువుల్ని ఇంటినుంచి సీజ్ చేశారు. అలోక్ లగ్జరీ లైప్ అధికారులనే ఆలోచనల్లో పడేసింది. ఓ సాధారణ కానిస్టేబుల్ ఎలా ఇంత లగ్జరీ లైఫ్ గడిపాడన్నదానిపై ఆరా తీస్తున్నారు. శుక్రవారం 7 వేల చదరపు అడుగుల అలోక్ ఇంటిలో సోదాలు నిర్వహించారు.


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సోదాల్లో అత్యంత ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్ ప్రద, గుచ్చీలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. రాడో వాచీలను కూడా అధికారులు గుర్తించారు. వీటితో పాటు పలు లగ్జరీ వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు అంతస్తుల ఆ ఇంటి నిర్మాణ ఖర్చులే 5 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు గుర్తించారు. కాగా, దగ్గు మందు వ్యాపారంలో కానిస్టేబుల్‌ అలోక్‌ భాగస్వామిగా ఉన్నాడు. 2006లో బంగారం దోపిడీ కేసులో అలోక్‌ అరెస్ట్‌ అయ్యాడు. ఆధారాలు లేకపోవటంతో కేసు నుంచి తప్పించుకున్నాడు. దగ్గు మందు కేసుకు సంబంధించి ఈ నెలలో అరెస్టయ్యాడు. ఇక, దగ్గు మందు రాకెట్ కేసులో ప్రధాన నిందితుడైన శుభమ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.


ఇవి కూడా చదవండి

ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు

నీ భర్తపై కేసు ఉందంటూ వృద్ధురాలికి కాల్.. చివరకు

Updated Date - Dec 15 , 2025 | 01:59 PM