Share News

Cobra With 80 Stitches: ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

ABN , Publish Date - Nov 26 , 2025 | 09:06 PM

ఓ వెటర్నరీ డాక్టర్ నాగుపాముకు సర్జరీ చేశాడు. ఇందుకోసం ఏకంగా 2 గంటల పాటు కష్టపడ్డాడు. పాముకు ఏకంగా 80 కుట్లు వేశాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మంగళవారం చోటుచేసుకుంది.

Cobra With 80 Stitches: ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
Cobra With 80 Stitches

మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయినిలో అత్యంత అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ వైద్యుడు గాయపడ్డ నాగుపాముకు సర్జరీ చేశాడు. ఇందుకోసం ఏకంగా 2 గంటల పాటు కష్టపడ్డాడు. పాముకు ఏకంగా 80 కుట్లు వేశాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి ఉజ్జయినిలోని విక్రమ్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో భవన నిర్మాణం కోసం తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ పాము జేసీబీ కారణంగా తీవ్రగాయాల పాలైంది. రక్తం కారసాగింది.


గాయాల బాధ తట్టుకోలేక ఆ పాము అటు, ఇటు తిరగసాగింది. దీంతో తలకు మరింత పెద్ద గాయం అయింది. దాన్ని చూసిన కొంతమంది మట్టితో కొట్టారు. పాపం ఆ పాము అల్లాడిపోయింది. ఆ తర్వాత స్నేక్ ఫ్రెండ్స్ రాహుల్, ముకుల్‌కు సమాచారం వెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఇద్దరూ పాము ఉన్న చోటుకు వచ్చారు. ఎంతో జాగ్రత్తగా గాయపడ్డ పామును పట్టుకున్నారు. దాన్ని వెటర్నరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ ముకేష్ జైన్, అతడి టీమ్ పాము తలపై లోతైన గాయం అయినట్లు, ఓ చోట చర్మం పూర్తిగా ఊడిపోయినట్లు గుర్తించారు.


సర్జరీ చేయకపోతే పాము చచ్చిపోతుందని భావించారు. తక్కువ మోతాదులో పాముకు అనస్తీషియా ఇచ్చి ఆపరేషన్ మొదలెట్టారు. దాదాపు 2 గంటల పాటు కష్టపడి ఊడిపోయిన పాము చర్మాన్ని అతికించారు. ఇందుకోస ఏకంగా 80 కుట్లు వేశారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. పాము ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత అడవిలో వదిలిపెట్టనున్నారు. ఆ నాగుపాము ఎలపిడి ఫ్యామిలీకి చెందినదని డాక్టర్ జైన్ ధ్రువీకరించారు.


ఇవి కూడా చదవండి

5 బీసీ కార్పోరేషన్లకు ఛైర్ పర్సన్లను నియమించిన ప్రభుత్వం

అయోధ్యలో జెండా ఎగరవేయడంపై పాక్ కారుకూతలు.. ఎడాపెడా వాయించేసిన భారత్

Updated Date - Nov 26 , 2025 | 09:15 PM