Share News

Mother Breaks Down: కాలుష్యం ఎంత పని చేసింది.. బిడ్డ కోసం వెక్కివెక్కి ఏడుస్తున్న తల్లి..

ABN , Publish Date - Nov 26 , 2025 | 05:13 PM

ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యం కారణంగా అక్కడి జనాలు అనారోగ్యం పాలవుతున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

Mother Breaks Down: కాలుష్యం ఎంత పని చేసింది.. బిడ్డ కోసం వెక్కివెక్కి ఏడుస్తున్న తల్లి..
Mother Breaks Down

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతూపోతోంది. వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. కాలుష్యం కారణంగా జనం అనారోగ్యం పాలవుతున్నారు. తీవ్రమైన శ్వాస కోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. చిన్న పిల్లల పరిస్థితి అయితే ఊహకందని విధంగా ఉంది. తాజాగా, ఓ బాలుడు వాయు కాలుష్యం కారణంగా తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. ముక్కు, గొంతు బాగా పాడయ్యాయి. సరిగా శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో డాక్టర్లు సర్జరీ చేయాల్సి వచ్చింది.


తన బిడ్డ పరిస్థితి చూసి తల్లి సాక్షి కన్నీటి పర్యంతం అవుతోంది. ఏ తల్లికీ తనలాంటి కష్టం రాకూడదని అంటోంది. ఆమె మాట్లాడుతూ.. ‘మేము రెండు సంవత్సరాల క్రితం ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాం. ఢిల్లీకి వచ్చిన తర్వాతి నుంచి నా బిడ్డ ఆరోగ్యం క్షీణించటం మొదలైంది. చిన్న చిన్న అలర్జీలు తీవ్రమైన శ్వాస కోశ సమస్యలుగా మారాయి. స్టెరాయిడ్ స్ప్రేలు, యాంటీ బయోటిక్స్, హోమియోపతి ఇలా అన్ని రకాలుగా ట్రై చేశాం. కానీ, ఎలాంటి లాభం లేకుండా పోయింది. కాలుష్యం పెరిగితే అడినాయిడ్స్, టాన్సిల్స్ సమస్య మరింత తీవ్రం అయ్యేది.


డాక్టర్లు ఆపరేషన్ చేయటం ఒక్కటే మార్గం అని చెప్పారు. నా బిడ్డ ముక్కు, గొంతు దగ్గర ఆపరేషన్ చేశారు. అతడ్ని ఇలా ఆస్పత్రి బెడ్‌పై చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. నా గుండె బద్ధలైంది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లోని పిల్లల పరిస్థితి ఇది. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం సైలెంట్‌గానే ఉంది. మనం ట్యాక్సులు కడుతున్నాం. దాని ప్రతిఫలంగా వ్యవస్థ నుంచి మన పిల్లలకు ఇలాంటి పరిస్థితి వస్తోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిపై తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

కూతురికి జన్మనిచ్చిన ముస్కాన్.. మొదలైన వివాదం..

కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఖర్గే కీలక వ్యాఖ్యలు

Updated Date - Nov 26 , 2025 | 05:20 PM