Delhi High court: భార్యను స్నేహితులతో పంచుకోవాలనుకున్నాడు.. భర్తకు బెయిల్ నిరాకరణ
ABN , Publish Date - Jun 18 , 2025 | 07:20 AM
కట్టుకున్న భార్యను శృంగార వస్తువుగా భావించి, అమెను ఇతరులతో పంచుకోవాలనుకున్న భర్తకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమెను పలు చిత్రహింసలు పెట్టి, ఇతరులతో శృంగారానికి బలవంతపెట్టిన భర్త జైలు నుంచి బయటకు రావడానికి అనర్హుడని ప్రకటించింది.

కట్టుకున్న భార్యను (Wife) శృంగార వస్తువుగా భావించి, అమెను ఇతరులతో పంచుకోవాలనుకున్న భర్తకు (Husband) ఢిల్లీ హైకోర్టు (Delhi High court) బెయిల్ నిరాకరించింది. ఆమెను పలు చిత్రహింసలు పెట్టి, ఇతరులతో శృంగారానికి బలవంతపెట్టిన భర్త జైలు నుంచి బయటకు రావడానికి అనర్హుడని ప్రకటించింది. ఇది సాధారణ గృహ హింస కేసు కాదని, నిందితుడు తన భార్యతో చాలా క్రూరంగా ప్రవర్తించాడని పేర్కొంది. నిందితుడిపై అత్యాచారం, సామూహిక అత్యాచారం, వేధింపులు, క్రూరత్వం మొదలైన కేసులు ఉన్నాయి.
గృహ హింస కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న నిందితుడు పెట్టుకున్న బెయిల్ (Bail) పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ కేసు వివరాల ప్రకారం.. బాధిత మహిళ తన భర్త చేతిలో దారుణ హింసలకు గురైంది. మరిది లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పినా ఆ భర్త పట్టించుకోలేదు. అలా ఫిర్యాదు చేసినందుకు భార్య చేతులను బ్లేడ్‌తో కోశాడు. గాయపడిన చేతులతోనే వంట చేయించేవాడు. భార్యను హోటల్‌కు తీసుకెళ్లి స్నేహితులతో శృంగారం చేయాల్సిందిగా బలవంతం చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధిత మహిళ ఫొటోలతో ఓ ఇన్‌స్టాగ్రామ్ ఐడీ క్రియేట్ చేసి ఆన్‌లైన్ ఆఫర్ ప్రకటించాడు. డబ్బులిచ్చి తన భార్యతో ఎవరైనా శృంగారంలో పాల్గొనవచ్చని ప్రకటించాడు. భర్త హింసలపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. మెజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాజాగా నిందితుడు బెయిట్ పిటిషన్ పెట్టుకోగా అతడి వేధింపులను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్ మంజూరుకు నిరాకరించారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం.. బాధితులకు ఎయిర్ ఇండియా అదనపు ఆర్థిక సాయం
27 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా తరహా ప్రమాదం.. ప్రాణాలు దక్కించుకున్న 11ఏ సీటు ప్యాసెంజర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి