Delhi Pollution: వింటర్ ఎఫెక్ట్.. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు
ABN , Publish Date - Nov 08 , 2025 | 10:44 AM
ఢిల్లీలో వింటర్ ఎఫెక్ట్ మొదలైంది. ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు శీతాకాలం కావడంతో సర్కారు నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు తీసుకొచ్చారు.
న్యూఢిల్లీ, నవంబర్ 8: దేశ రాజధాని ఢిల్లీలో వింటర్ సీజన్ ఎఫెక్ట్ మొదలైంది. అసలే ఒకవైపు వాయు కాలుష్యం, మరోవైపు శీతాకాలం కావడంతో ఢిల్లీ సర్కారు నివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు తీసుకొచ్చారు.
నవంబర్ 15 నుండి ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తాయని, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 8:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పనిచేస్తాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు.
సవరించిన పనివేళల మార్పులు 2026, ఫిబ్రవరి 15 వరకు అమలులో ఉంటాయని సీఎం రేఖా గుప్తా తెలిపారు. శీతాకాల సమంలో ట్రాఫిక్ ఒకేసారి పెరగకుండా ఉండేదుకు, కాలుష్యాన్ని తగ్గించడమే దీని ఉద్దేశ్యమని అన్నారు.
ప్రస్తుతం ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9:30 గంటలకు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు ఉదయం 9:00 గంటలకు ప్రారంభమవుతున్నాయి. ఢిల్లీలో క్షీణిస్తున్న వాయు నాణ్యతపై ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ సీనియర్ అధికారుల మధ్య జరిగిన సమావేశం తర్వాత రేఖా గుప్తా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇవి కూడా చదవండి:
వారణాసిలో మోదీ పర్యటన.. నాలుగు వందేభారత్ రైళ్లు ప్రారంభం
జనసమ్మర్థ ప్రాంతాల్లో వీధి కుక్కలు కనపడొద్దు.. సుప్రీం ఆదేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి