Share News

New Delhi: ప్రజాగ్రహానికి తలవంచిన ఢిల్లీ సర్కారు

ABN , Publish Date - Jul 04 , 2025 | 03:44 AM

ప్రజాగ్రహానికి ఢిల్లీ సర్కారు తలొగ్గింది. రోడ్లపై పాత వాహనాలు తిరగకూడదని, వాటికి బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుతానికి పక్కనపెట్టింది.

New Delhi: ప్రజాగ్రహానికి తలవంచిన ఢిల్లీ సర్కారు

  • పాత వాహనాల రద్దుపై ఆదేశాల అమలు నిలిపివేత

న్యూఢిల్లీ, జూలై3: ప్రజాగ్రహానికి ఢిల్లీ సర్కారు తలొగ్గింది. రోడ్లపై పాత వాహనాలు తిరగకూడదని, వాటికి బంకుల్లో ఇంధనం పోయకూడదంటూ ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుతానికి పక్కనపెట్టింది. 15ఏళ్లు నిండిన డీజిల్‌ వాహనాలు, 10ఏళ్లు దాటిన పెట్రోలు వాహనాలను జీవితకాలం ముగిసిన (ఈఓఎల్‌) వాహనాలుగా గుర్తించి వాటికి ఇంధనం పోయకూడదంటూ ఆదేశాలుఇచ్చింది. ఈఓఎల్‌ విధాన ఉత్తర్వులు ఈనెల ఒకటో తేదీ నుంచి అమల్లోకివచ్చాయి. వాయు నాణ్య త నిర్వహణ కమిషన్‌ (సీఏక్యూఎం) ఈ ఉత్తర్వులను జారీ చేసింది. దీనిపై పెద్దయెత్తున వ్యతిరేకత రావడంతో ఆ ఆదేశాల అమలును నిలిపేసింది.


పాత వాహనాలను గుర్తించి ఇంధనం పోయకూడదన్న ఆదేశాలను అమలు చేయడం చాలా కష్టమని ఢిల్లీ పర్యావరణ మంత్రి మన్‌జీందర్‌ సింగ్‌ సిస్రా గురువారం చెప్పారు. 10, 15ఏళ్లు దాటినా జాగ్రత్తగా నిర్వహిస్తున్న కార్లు, బైకులకు నష్టం కలిగించబోమన్నారు. నిర్వహణ సరిగ్గాలేని వాహనాల స్వాధీనాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఈఓఎల్‌ విధానంతో జాతీయ రాజధాని ప్రాంతంలోని 62లక్షల వాహనాలపై ప్రభా వం చూపనుండడంతో యజమానుల్లో ఆందోళన వ్యక్తమైంది.

Updated Date - Jul 04 , 2025 | 03:44 AM