Share News

City Enters Red Zone: ప్రమాదం అంచున ఢిల్లీ.. 400 దాటిన AQI

ABN , Publish Date - Nov 08 , 2025 | 09:03 PM

దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది. ఢిల్లీ రెడ్ జోన్‌లోకి వెళ్లిపోయింది. ది డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ చెబుతున్న దాని ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవటానికి పంట వ్యర్థాలను తగలబెట్టడం ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. దాదాపు 30 శాతం గాలి కాలుష్యం పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే జరుగుతోంది.

City Enters Red Zone: ప్రమాదం అంచున ఢిల్లీ.. 400 దాటిన AQI
City Enters Red Zone

దేశ రాజధాని ఢిల్లీ గాలి కాలుష్యంతో అల్లాడిపోతోంది. చలికాలం కావటంతో గాలి కాలుష్యం రోజు రోజుకు పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. శనివారం ఢిల్లీ పరిస్థితి దారుణంగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400 దాటింది. గాలి కాలుష్యం ప్రమాదక స్థాయిలకు చేరటంతో ఢిల్లీ ‘రెడ్ జోన్‌‌‌’లోకి వెళ్లిపోయింది. దేశంలో అత్యంత గాలి కాలుష్యం కలిగిన సిటీల్లో ఒకటిగా నిలిచింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వివరాల ప్రకారం.. ఢిల్లీలో సాయంత్రం 4 గంటల సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 361గా ఉంది.


దీంతో దేశ రాజధాని దేశంలోనే అత్యంత గాలి కాలుష్యం కలిగిన సిటీల్లో రెండవ స్థానంలో నిలిచింది. సిటీలోని కొన్ని ఏరియాల్లో గాలి కాలుష్యం చాలా దారుణమైన స్థాయిల్లో ఉంటోంది. వాజీపూర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 420కి చేరింది. బురారిలో 418, వివేక్ విహార్‌లో 406, నెహ్రూ నార్‌లో 404, ఐటీఓలో 402గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అయింది. ఇక, శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 322గా ఉండింది. దేశ రాజధాని చుట్టు పక్కల ఉన్న సిటీల్లో కూడా గాలి నాణ్యత చాలా దారుణంగా ఉంది.


నోయిడాలో 354, గ్రేటర్ నోయిడాలో 336, ఘజియాబాద్‌లో 339గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదు అయింది. ది డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ చెబుతున్న దాని ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోవటానికి పంట వ్యర్థాలను తగలబెట్టడం ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. దాదాపు 30 శాతం గాలి కాలుష్యం పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే జరుగుతోంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాహనాల కంటే పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే ఎక్కువగా గాలి కాలుష్యం జరుగుతోంది. ఒక్క శుక్రవారం రోజే పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో 290 పంట వ్యర్థాల దహనం ఘటనలు చోటుచేసుకున్నాయి.


ఇవి కూడా చదవండి

సోదరుడికి గుండెపోటు.. హుటాహుటిన ఆస్పత్రికి సూపర్ స్టార్

ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. వ్యవసాయం ఎలా చేస్తున్నాడో చూడండి..

Updated Date - Nov 08 , 2025 | 09:08 PM