Share News

Prime Minister Modi: మోదీతో రాజ్‌నాథ్‌ 40నిమిషాలు భేటీ

ABN , Publish Date - Apr 29 , 2025 | 05:26 AM

పహల్గాములో జరిగిన ఉగ్రదాడి తరువాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భద్రతా ఏర్పాట్లు, ఉగ్రవాదుల కోసం సాగుతున్న వేట తదితర అంశాలను సమగ్రంగా చర్చించారు.

Prime Minister Modi: మోదీతో రాజ్‌నాథ్‌ 40నిమిషాలు భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు, ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట తదితర అంశాలను సమగ్రంగా వివరించారు. ఈ ఇరువురి సమావేశం సుదీర్ఘంగా 40నిమిషాల పాటు కొనసాగింది. అంతకుముందు రాజ్‌నాథ్‌తో భారత ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేదీ సమావేశమయ్యారు. కశ్మీర్‌లో ముఖ్యంగా పహల్గాంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను వివరించారు. ఈ నెల 22న పహల్గాం ఉగ్రదాడిలో 26మంది చనిపోయారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 05:26 AM