Share News

Drug Safety DCGI QR Code: ఔషధాలతో సైడ్ ఎఫెక్ట్స్.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం

ABN , Publish Date - Nov 21 , 2025 | 09:46 AM

మందులతో సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తిన సందర్భాల్లో వినియోగదారులు నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు వీలుగా డీసీజీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా హోల్‌సేల్, రిటెయిల్ మెడికల్ షాపుల్లో ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది.

Drug Safety DCGI QR Code: ఔషధాలతో సైడ్ ఎఫెక్ట్స్.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం
DCGI QR Code for Complaints on Medicine Side-effects

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కల్తీ దగ్గు మందులతో చిన్నారులు మరణించిన వైనం దేశవ్యాప్తంగా కలకలానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అప్రమత్తమైంది. మందులతో సైడ్‌ఎఫెక్ట్స్‌ తలెత్తిన సందర్భాల్లో ప్రజలు నేరుగా ఫార్మకోవిజిలెన్స్ ప్రోగ్రామ్ ద్వారా ఫిర్యాదు చేసేలా మెడికల్ షాపుల్లో క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. హోల్‌సేల్, రిటెయిల్ షాపులు అన్నిటిలో వీటిని ఏర్పాటు చేయాలని డీసీజీఐ మార్గదర్శకాలు జారీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి (DCGI QR Code for Complaints on Medicine Side-effects).

ఔషధ భద్రత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా డీసీజీఐ ఈ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల ఫార్మకో విజిలెన్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన వర్కింగ్ గ్రూప్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. మెడికల్ షాపుల్లో ఈ క్యూఆర్ కోడ్ కనిపించేలా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులు చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాలు జారీ చేసింది.


డీసీజీఐ మార్గదర్శకాల ప్రకారం, క్యూఆర్ కోడ్‌తో పాటు హెల్ప్‌ లైన్ నెంబర్ కూడా వినియోగదారులు తెలిసేలా ప్రదర్శించాలి. మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా వెంటనే ఫిర్యాదు చేయాలని డీసీజీఐ సూచించింది. కల్తీ దగ్గుమందు కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 25 మంది చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. డైఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థంతో కాఫ్ సిరప్ కలుషితం కావడంతో ఈ దారుణాలు జరిగాయి. ఇక కాఫ్ సిరప్‌ను తయారు చేసిన కంపెనీ ఓనర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లైసెన్సును కూడా రద్దు చేశారు. దేశవ్యాప్తంగా ఫార్మా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించారు.

DCGI.jpg


ఇవి కూడా చదవండి...

పంజాబ్‌లో ఎన్‌కౌంటర్.. పోలీసుల అదుపులో ఇద్దరు ఉగ్రవాదులు

తాజ్‌మహల్‌ను సందర్శించిన ట్రంప్ జూనియర్

Read Latest National News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 03:45 PM