Class 9 Girl Raped: 9వ తరగతి బాలికపై నలుగురు విద్యార్థులు అత్యాచారం!
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:09 PM
Class 9 Girl Raped: ఉత్తర ప్రదేశ్ ఘజియాబాద్ నగరంలో దారుణం జరిగింది. 9వ తరగతి బాలికపై నలుగురు మైనర్ విద్యార్థులు అత్యాచారం చేశారు. బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.

జాతీయం, జులై 16: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాల (Rape Incidents) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తమ కామదాహాన్ని తీర్చుకునేందుకు పసిపిల్లలను సైతం కొందరు కామాంధులు వదలడం లేదు. తాజాగా సమాజాన్ని ఆందోళన కలిగించే సంఘటన ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఘజియాబాద్ (Ghaziabad Girl Raped) నగరంలో 9వ చదువుతున్న బాలికపై ఆమె తోటి చదువుతున్న నలుగురు అబ్బాయిలు కలిసి అత్యాచారం చేశారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ కేసు విచారణను ప్రారంభించారు.
బాలిక ఇంట్లోనే నలుగురు..!
పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ నగరంలోని ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం ఉదయం 9వ తరగతి బాలికపై నలుగురు మైనర్ బాలురు అత్యాచారం చేసినట్లు తమకు ఫిర్యాదు అందడంతో ఘటన స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. విచారణలో నలుగురిలో ముగ్గురు బాలికకు పాఠశాల నుండే తెలిసినవారేనని అన్నారు. ఈ సంఘటన జరిగినప్పుడు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉందని .. ఆమె తల్లి మార్కెట్‌కు వెళ్లిందని పోలీసులు తెలిపారు.
'ఆ మైనర్ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అబ్బాయితో పరిచయం పెంచుకుంది, అతను తనను కలవమని మెసేజ్ చేస్తున్నాడు. ఆదివారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో అతను ఆమె ఇంటికి చేరుకుని తలుపు తట్టాడు. ఆమె గేటు తెరిచినప్పుడు, అతను మరో ముగ్గురు అబ్బాయిలతో కలిసి బలవంతంగా గదిలోకి చొరబడి ఆమెపై బలవంతంగా దాడి చేశారు. ఈలోగా, ఆమె తల్లి మార్కెట్ నుండి ఇంటికి తిరిగి వచ్చి ఇంటి తలుపు తెరిచి ఉంది.
ఆమె లోపలికి వెళ్లి, తన కుమార్తెతో పాటు నలుగురు అబ్బాయిలను చూసింది. ఆమె తన కుమార్తెను గది నుండి బయటకు తీసుకెళ్లి, పోలీసులకు ఫోన్ చేసే ముందు అబ్బాయిలను లోపలికి లాక్ చేసింది" అని అధికారి తెలిపారు. అత్యాచారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరూ 9, 10, 11 తరగతులు చదువుతున్నారని.. బాలికను వైద్య పరీక్షల కోసం పంపినట్లు ఏసీపీ తెలిపారు. బాలిక వాంగ్మూలం ఇంకా నమోదు కాలేదని.. ఈ నేపథ్యంలో నిందితులను అరెస్టు చేయలేదని.. ఈ కేసుపై విచారణ కొనసాగుతుందని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి..
వాకింగ్ చేస్తున్న నేతపై కాల్పులు.. హైదరాబాద్‌లో దారుణం
మరికొన్ని గంటల్లో ఉరి.. అద్భుతం జరుగుతుందా?..