CJI Gavai: రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులు చేపట్టను
ABN , Publish Date - Jul 27 , 2025 | 06:29 AM
పదవీ విరమణ తర్వాత తాను ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు.

మధ్యవర్తిత్వం చేస్తా.. సీజేఐ గవాయ్ స్పష్టీకరణ
అమరావతి (మహారాష్ట్ర), జూలై 26: పదవీ విరమణ తర్వాత తాను ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్.గవాయ్ చెప్పారు. సలహా సంప్రదింపులు, మఽధ్యవర్తిత్వం వంటి సేవలు అందిస్తానని తెలిపారు. శనివారం అమరావతి జిల్లా, సెషన్స్ కోర్టు ఆవరణలో టి.ఆర్.గిల్దా స్మారక ఈ-గ్రంథాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబరు 23న ఆయన పదవీ విరమణ చేయనున్నారు. నవంబరు 24 తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవిని అంగీకరించబోనని తెలిపారు.