Share News

Operation Sindoor: ఇండియా, పాకిస్థాన్‌ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:42 AM

భారత్, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన యుద్ధాన్ని చైనా తెలివిగా ఉపయోగించుకుంది. పాకిస్థాన్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చింది. ఓ వైపు ఆదాయం పొందటంతో పాటు మరో వైపు ఆయుధాల ట్రైల్స్ పూర్తి చేసింది.

Operation Sindoor: ఇండియా, పాకిస్థాన్‌ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..
Operation Sindoor

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్‌’ చేపట్టింది. పాకిస్తాన్‌తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఈ నేపథ్యంలోనే భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగింది.


చైనా మాస్టర్ మైండ్..

భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరిగిన యుద్ధాన్ని చైనా తెలివిగా ఉపయోగించుకుంది. యుద్ధ సమయంలో పాకిస్థా‌న్‌కు పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చింది డ్రాగన్ కంట్రీ. అయితే, ఈ ఆయుధాల సరఫరా వెనుక పెద్ద ప్లానే ఉందని ఇప్పుడు వెల్లడైంది. చైనా తను తయారు చేసిన హెచ్‌క్యూ 9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, పీఎల్ 15 ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్, జీ 10 ఫైటర్ క్రాఫ్ట్స్‌ను పాకిస్థాన్‌కు ఇచ్చింది. పాక్ ఈ ఆయుధాలను ఇండియాపై ప్రయోగించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. లైవ్ టెస్ట్ ట్రయల్ కోసం చైనా ఆ ఆయుధాలను పాకిస్తాన్‌కు ఇచ్చిందట. ఈ విధంగా చైనా రెండు రకాలుగా ప్రయోజనం పొందిందట. అదెలాగంటే.. ఆయుధాలు విక్రయించడం ద్వారా ఆదాయం పొందడంతో పాటు.. ట్రయల్స్ కూడా పూర్తి చేసేసింది.


రాఫెల్ యుద్ధ విమానాలపై తప్పుడు ప్రచారాలు..

ఫ్రెంచ్ ఇంటెలిజెన్స్ కథనం ప్రకారం.. చైనాకు చెందిన జే 35 యుద్ధ విమానాల స్థానంలో ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాలను కొనుక్కోవాలని ఇండోనేషియా భావించింది. ఈ విషయం తెలుసుకున్న చైనా రాఫెల్ యుద్ధ విమానాలపై తప్పుడు ప్రచారాలు చేయటం మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి.. ఏఐ, వీడియో గేమ్ వీడియోలను పోస్టు చేసింది. రాఫెల్ యుద్ధ విమానాలను తమ జే 35 విమానాలు కూల్చేసినట్లు ఆ వీడియోల ద్వారా తప్పుడు ప్రచారానికి తెర తీసింది. వీటిని బూచీగా చూపించి చైనీస్ ఎంబసీ అధికారులు ఇండోనేషియాను ఒప్పించి మరీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలును ఆపేయించారు.


ఇవి కూడా చదవండి

కాలువ కోసం రూ.10 కోట్ల స్థలం విరాళం..

ఈ సూప్‌లు శీతాకాలంలో శరీరానికి అమృతం లాంటివి!

Updated Date - Nov 22 , 2025 | 05:20 PM