Kiren Rijiju: కాస్త ‘జాగ్రత్త’గా మాట్లాడండి
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:24 AM
టిబెట్ అత్యున్నత బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది.

దలైలామా వారసుడి ఎంపికపై కేంద్ర మంత్రి రిజిజు వ్యాఖ్యలకు చైనా స్పందన
బీజింగ్, జూలై 4: టిబెట్ అత్యున్నత బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెట్ సంబంధిత అంశాలతో తమ దేశ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. మాటల్లో, చర్యల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. 14వ దలైలామా చైనా వ్యతిరేక స్వభావాన్ని భారత్ గుర్తించాలని, అదేవిధంగా జిజాంగ్ (టిబెట్) సంబంధిత అంశాల్లో తమ వైఖరిని గౌరవించాలని పేర్కొంది.
దలైలామా వారసుడి ఎంపిక విషయంలో గత రెండు రోజులుగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తదుపరి దలైలామాను ఎన్నుకొనే అధికారం ప్రస్తుత దలైలామా లేదా సంబంధిత సంస్థ చేతుల్లోనే ఉందని, ఈ విషయంలో మరెవరూ జోక్యం చేసుకోలేరని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గురువారం నొక్కిచెప్పారు.