Share News

Chardham Yatra 2025: చార్‌ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే

ABN , Publish Date - Feb 17 , 2025 | 02:41 PM

ఏప్రిల్ 30 నుంచి చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో భక్తులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు

Chardham Yatra 2025: చార్‌ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ వివరాలు ఇవే
Char Dham Yatra 2025

ఇంటర్నెట్ డెస్క్: భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చార్‌ధామ్ యాత్ర కొద్ది నెలల్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏటా జరిగే ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ చేరుకుంటారు. ఏప్రిల్ 30న గంగోత్రి, యమునోత్రి దేవాలయాల ద్వారాలు తెరుచుకోనున్నాయి.బద్రీనాథ్ ద్వారాలు మే 4న తెరుచుకోనుండగా, కేదార్‌నాథ్ ప్రకటన మాత్రం మహాశివాత్రి నాడు ఉండొచ్చని సమాచారం.

యాత్రకు సంబంధించి రిజిస్ట్రేషన్‌లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ విధానాల్లో పేర్లను నమోదు చేసుకునేందుకు భక్తులకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రారంభమైన మొదటి 15 రోజులు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌లు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. ఆ తరువాత డిమాండ్‌ను బట్టి అధికారులు ఈ వేళల్లో మార్పులు చేయనున్నారు.


Delhi Chief Minster: గురువారం అట్టహాసంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం

భక్తుల సౌకర్యార్థం హరిద్వార్, రిషికేశ్‌లల్లో 20 రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వికాస్ నగరంలో మరో 15 సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఇక యూపీ ప్రభుత్వ వెబ్‌సైట్ registrationandtouristcare.uk.gov ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మార్చి 1 నుంచి ఆన్‌లైన్‌లో పేర్ల నమోదు ప్రారంభం కానుంది. హిమాలయాల్లో సంక్లిష్టమైన మార్గంలో సాగే ఈ యాత్రకు ముందస్తుగా పక్కా ప్రణాళికతో సిద్ధం కావాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా యాత్రికులు తమ పేర్లను రిజిసర్ట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

భారత పురాణాలు ప్రకారం, చార్‌ధామ్ యాత్రలో పాల్గొన్న భక్తులు సకల పాపాల నుంచి విముక్తి పొందుతారు. జనన మరణాల వలయం నుంచి బయటపడి భవంతుడిలో ఐక్యమవుతారు. హిందూ సంప్రదాయంలో చార్‌ధామ్ యాత్ర అత్యంత విశిష్టమైనది.


USAID: యూఎస్ఏఐడీ అతిపెద్ద స్కామ్.. ప్రధాన మంత్రి సలహాదారు కామెంట్

చార్‌ధామ్ యాత్ర విశేషాలు

యమున మాత కొలువుదీరిన యమునోత్రి దేవాలయం ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. ఈ దేవాలయాన్ని టెహ్రీ ఘర్వాల్‌కు చెందిన మహారాజా ప్రతాప్ సింగ్ నిర్మించారు. జానకీ ఛట్టీ నుంచి భక్తులు కాలినడకన 6 కిలోమీటర్లు ప్రయాణించి ఈ దేవాలయానికి చేరుకుంటారు. ఇక గంగోత్రీ దేవాలయం సముద్రమట్టానికి 3,048 మీటర్ల ఎత్తులో ఉంది. గంగా మాత కొలువుదీన ఈ దేవాలయం అత్యంత పవిత్రమైనది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కేదార్‌నాథ్ దేవాలయం ప్రాముఖ్యతను మాటల్లో వర్ణించడం అసాధ్యం. పురాణాల ప్రకారం, పాండవులు ఈ దేవాలయాన్ని నిర్మించారట. ఆ తరువాత ఆది శంకరాచార్యుల సారథ్యంలో దేవాలయానికి ప్రస్తుతమున్న స్థితిలోకి మార్పులు చేశారు. శ్రీమహావిష్ణువు అవతారమైన బద్రీనాథుడు కొలువుదీరిన బద్రీనాథ్ దేవాలయం వేదకాలంలో ఉనికిలోకి వచ్చిందంటారు. ఆ తరువాత తొమ్మిదో శతాబ్దంలో దేవాలయానికి అనేక మార్పులు చేసినప్పటికీ గర్భగుడికి మాత్రం నాటి నుంచి నేటి వరకూ ఎటువంటి మార్పుల చేయకపోవడం ఈ దేవాలయం ప్రత్యేకత.

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Feb 17 , 2025 | 02:53 PM