Share News

Waqf Act: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో వాదనలు వినిపించిన కేంద్రం

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:14 PM

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో ఇవాళ కూడా వాదనలు వాడివేడిగా జరిగాయి. పార్లమెంట్ చేసిన ఈ చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని కేంద్రం సుప్రీంకు తెలిపింది.

Waqf Act: వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంలో వాదనలు వినిపించిన కేంద్రం
Waqf Act

Waqf Act: కొత్త వక్ఫ్ చట్టాల అమలుపై పాక్షికంగా లేదా పూర్తిగా స్టే విధించడాన్ని తాము వ్యతిరేకిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. మోదీ సర్కారు కొత్తగా తెచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై అత్యున్నత న్యాయస్థానంలో ఇవాళ వాదనలు వాడి వేడిగా జరిగాయి. ఇప్పటికే పలు పార్టీలు, ముస్లిం సంఘాలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారిస్తున్న సందర్భంలో కేంద్రం తమ స్టాండ్ ను సుప్రీం కోర్టుకు నివేదించింది.

కోర్టులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చట్టబద్ధమైన నిబంధనలను నిలిపివేసే అధికారం లేదని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలియచెప్పే ప్రయత్నం చేసింది. "పార్లమెంట్ చేసిన చట్టాలకు రాజ్యాంగబద్ధత ఉంది. కోర్టు మధ్యంతర స్టే అధికారాల సమతుల్యత దీనికి విరుద్ధం" అని కోర్టుకు తెలిపింది.

ముస్లింయేతర సభ్యులు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర-నిర్దిష్ట వక్ఫ్ బోర్డులలో భాగంగా ఉండాలని, కనీసం ఐదు సంవత్సరాల పాటు ముస్లింలుగా ఉన్నవాళ్లు మాత్రమే వక్ఫ్ విరాళాలు ఇవ్వవచ్చు అనే నియమాలు ఉన్న కొత్త చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారిస్తోంది. కాగా, కొత్తగా తెచ్చిన సవరణ చట్టం ముస్లింల బహుళ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషనర్లు కోర్టులో వాదించారు.


Read Also: Summer Tips: ఎండలో తిరిగి ఇంటికి రాగానే.. ఈ 4 పొరపాట్లు చేయకండి..

Favorite Color: కలర్ సైకాలజీ తెలుసా.. ఫేవరెట్ కలర్ బట్టి వ్యక్తిత్వం కనుక్కోవచ్చు..

Sleeping Tips: రాత్రి లైట్లు ఆఫ్ చేసి పడుకోవాలా.. చీకట్లో నిద్రపోతే మంచిదా..

Updated Date - Apr 25 , 2025 | 03:21 PM